ఓటు హక్కు పై అవగహన :

ఓటు హక్కు పై అవగహన :

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట ఏప్రిల్ 19:

నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆవరణలో ఓటరు అవగాహన ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు.
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.
ప్రధాన రహదారులు గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.
నీ ఓటు ద్వారా నీకు లాభం చేకూరుతుందంటే నీవు ఈ దేశానికి ద్రోహం చేస్తున్నట్లే! నీవు వేసే ఓటు నీకు మాత్రమే కాదు నీ సమాజానికి, నీ దేశానికి మేలు చేసేలా ఉండాలి.

నీ వేలిపై వేసే మరక ఈ దేశపు అవినీతి తుడిచివేయాలి.ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరు తన ఓటును ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలి. ఓటు హక్కు ఎంతో పవిత్రమైనది దానికి ఎంతో సార్థకత ఉంటుంది. విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దు. ఓటు విలువైన ఆయుధం.

ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ప్రజా ప్రభుత్వమే ‘ప్రజాస్వామ్యం’. మన దేశం సర్వ స్వతంత్ర, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక దేశం. దేశంలోని ప్రతి ఒక్కరూ సమానం. అందరికీ సమాన స్వేచ్ఛ, హక్కులు రాజ్యాంగం ప్రకారం ఉంటాయి.


నోటు తీసుకుని ఓటు వేసి ప్రశ్నించే హక్కుని కోల్పోతున్నాము. డబ్బుకు అమ్ముడుపోయి అవినీతి కుళ్లు రాజకీయాలకు ప్రజలను తప్పుడు దారిలోకి తీసుకుపోతున్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా, సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలంటే. మన జీవితాలను, తలరాతను మార్చేది ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడ నిర్ణయించి నాయకుల తలరాతలను మారుస్తుంది. ఓటు దేశ దిశ, దశను మారుస్తుంది.


ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని దానిని వినియోగించుకోవాలని కోరారు. మద్యం డబ్బులకు ఓటును అమ్ముకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు.

You may also like...

Translate »