ఉస్మాన్ నగర్ లో అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్య దినోత్సవం

ఆర్ సి పురం మండలంలో ఉస్మాన్ నగర్ అంగన్వాడి సెంటర్లో ఈ సీ సీ ఈ డే పూర్వ ప్రాథమిక విద్య దినోత్సవంను నిర్వహించడం జరిగింది .

ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము జూన్ నెల నుండి ఏప్రిల్ నెల వరకు నేర్పించే కార్యక్రమాలను పిల్లలచే అక్షర పరిచయాలు, పాటలు, కథలు చెప్పించి తల్లులకు చూపించడం జరిగింది .

ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం. జ్యోతి హాజరైనారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు నర్సరీ, ఎల్ కె జీ, యూ కే జీ కి ధీటుగా చెప్పడం జరుగుతుంది. అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ఎన్. మంజుల, ఆయమ్మ డి. గున్నమ్మ, అంగన్వాడి కేంద్రం పిల్లలు, తల్లులు, నానమ్మలు హాజరయ్యారు.

You may also like...

Translate »