వందశాతం ఉత్తీర్ణతతో అప్ గ్రేడ్

-విద్యార్థులు పెరగడంతో మరోచోటికి

-వసతులున్నా..స్థానిక విద్యార్థులకు అన్యాయం

జ్ఞాన తెలంగాణ, మొగుళ్ళపల్లి మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాగా ఆ పాఠశాలలో చదివే విద్యార్థులు 10వ తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణులయ్యారు. దాంతో ప్రభుత్వం హర్షించి అందులోనే ఇంటర్ విద్యను కూడా కొనసాగించాలని ప్రభుత్వం ఆ పాఠశాలను అప్ గ్రేడ్ చేస్తూ ఇంటర్ కళాశాలను ప్రారంభించింది. ఈ క్రమంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుండగా వసతులు లేవని ఆ పాఠశాలను కూడా మొగుళ్ళపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలకు బదిలీ చేశారు. అయితే ఆ పాఠశాలను కూడా ఇంటర్ కు అప్ గ్రేడ్ చేయడంతో..విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో అధికారులు వినూత్న రీతిలో చర్యలు తీసుకున్నారు. వెంకటాపురం మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల ఇంటర్ కళాశాల విద్యార్థులను హన్మకొండ జిల్లాలోని దామెర మండలంలో గల ఎస్ బి ఐ టి ఇంటర్ కళాశాలకు తరలించారు. అలాగే మొగుళ్ళపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కళాశాల ఇంటర్ విద్యార్థులను హన్మకొండ జిల్లాలోని కమలాపురం మండలంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలకు తరలించారు. దాంతో మొగుళ్ళపల్లిలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అవస్థలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. కాగా స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు మొగుళ్ళపల్లిలోని కళాశాలలోనే మా విద్యార్థులను కొనసాగించేలా చర్యలను తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కోరారు.

You may also like...

Translate »