ఏక రూప దుస్తులు అందుచేత:

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:

ఏక రూప దుస్తులు అందుచేత:


జఫర్ గఢ్ మండలంలోని తమ్మడపల్లి ఐ ప్రాథమికోన్నత పాఠశాల లో హెచ్ఎం.శ్రీమతి వి.శాంతకుమారి అధ్యక్షత న ప్రొఫసర్ జయ శంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి జఫర్ గఢ్ యం పి పి రడపాక. సుదర్శన్ ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా విద్యార్థుల కు ఏక రూప దుస్తులు,నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు అందచేశారు, ఈసందర్భంగా మాట్లాడుతూ మన ఊరి బడిని, మనమే కాపాడు కోవాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని అని అన్నారు.విద్యార్థులు బాగా చదువుకోవాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఎ పిసి చైర్మన్ శ్రీమతి.రామేజు.కవిత ,సెక్రటరీ. వీరమ్మ,విఎ ఓ అసిస్టెంట్ రడపాక. సుమలత,కోశాధికారి కదురు. కవిత,సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తదితరులు. పాల్గొన్నారు.

You may also like...

Translate »