నిరుద్యోగులను మోసం చేసినకేంద్ర ప్రభుత్వం

నిరుద్యోగులను మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం కదా అని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ లో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజీత్ రెడ్డికి మద్దతుగా సాగుతున్న జైత్రయాత్ర వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, పిసిసి ప్రతినిధి దీపా భాస్కర్ రెడ్డి సరూర్నగర్ డివిజన్ ఎన్నికల ఇంచార్జ్ బాలాపూర్ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బేర బాల కిషన్ (బాలన్న ) మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనిత దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రంజిత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు..

ఈ సందర్భంగా సరూర్నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్ చౌరస్తాలో సరూర్నగర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సభలో ప్రజల ఉద్దేశించి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా అన్యాయం చేసిందని రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువకుల భవిష్యత్తును నాశనం చేసిందని నాలుగు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యక్రమాల పట్ల ప్రత్యేక చొరవ చూపుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి అభ్యర్థికి అసలు తెలుగు మాట్లాడడమే రాదని అసలు ప్రజలను గుర్తుపట్టడని ఈ రెండు మూడు రోజులుగా చేవెళ్ల నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా ప్రజలు అఖండ స్వాగతం పలుకుతున్నారని చేవెళ్ల పార్లమెంట్లో లక్ష ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని రంజిత్ రెడ్డి జోష్యం చెప్పారు.

You may also like...

Translate »