యు టర్న్ ఏర్పాటు చేశారు కానీ ఉపయోగం ఎం ఉంది..

యు టర్న్ ఏర్పాటు చేశారు కానీ ఉపయోగం ఎం ఉంది..
- వాహనదారుల అవస్థలు
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్ డిసెంబర్ 28:
పురపాలక పరిధి లో యు టర్న్ వద్ద కొద్ది రోజులు తెరిచి ఉండడం మూసి వేయడం తో ఆవాహన దారులు అవస్థలు అలవికానివి ఎంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.శంషాబాద్ పురపాలక పరిధి లో.ఎయిర్ పోర్ట్ ఏర్పాటు ఐన తర్వాత వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం తో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇదివరకు ఒక యు టర్న్ ఉండేది ఐతే పెరుగుతున్న జనాభా వాహనాల రద్దు నిత్యం పెరిగి పోతుందడం తో ప్రమాదాలు కూడా అంతకంతకూ పెరిగి పోతున్నాయి.ఇంతలో ఎయిర్ పోర్ట్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగడం తో ఒక వైపు రద్దీ పెరిగినా ఫ్లై ఓవర్ కింద జాతీయ రహదారి పై కూడా పెద్ద ఎత్తున రద్దీ పెరిగి పోతుంది పట్టణం రెండు వైపులా విస్తరించడం తో అటు ఇటు రాకపోకలు సాగించాలంటే పట్టణాల్లో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్ బార్చై వద్ద ఫ్లై ఓవర్ వచ్చిన తర్వాత భావర్చి వద్ద మరో వాహనాల సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు.ఇటీవల నూతన ఫ్లేవర్ నిర్మాణ సమయం లో కూడా యు టర్న విషయం లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రస్తుతం భావర్చీ వద్ద ఇవి కూడా కేవలం కేవలం సుమారు 30 అడుగుల దూరం లోనే ఉన్నాయి.ఐతే ఈ రెండు యూటర్న్ ఒక వేళ దాటితే ఇక అటు వైపు నుంచి ఇటు ఇటు వైపు నుంచి అటు వెళ్ళాలంటే మాత్రం సమస్యలు తప్పడం లేదంటున్నారు.పెట్రోల్ కోసం వెళితే రెండు కిలోమీటర్ల మేర వెళితేనే యు టర్న్,ఇక మరో వైపు సుమారు తొందుపల్లీ ఫ్లై ఓవర్ వద్దకు రావాలి ఇలా సమస్యలు ఈ పరిస్థితి గుర్తు అప్పట్లో శంషాబాద్ పట్టణం వాసులు శంషాబాద్ నిర్మాణం జరిగే ఫ్లై ఓవర్ మసీద్ వరకు పూర్తి నిర్మాణం అవుతుండడం తో సిద్ధాంతి వాళ్ళు అక్కడి నాయకులు సిద్ధాంతి చౌరస్తా వద్ద ప్రమాదాల కు నిలయంగా మారుతుందని గతం లో రోడ్డు దాటే క్రమం లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని సిద్ధాంతి వరకు ఫ్లై ఓవర్ నిర్మాణ చేపట్టాలని లేని పక్షంలో.ఫ్లై ఓవర్ నిర్మాణం నిలిపివేయాలని ధర్నాలు సహితం చేశారు.ఇక్కడి ధర్నాలు జాతీయ రహదారి అధికారులు పార్లమెంట్ సభ్యులు కూడా అప్పట్లో స్పందించిన సందర్భాలు ఉన్నాయి.ఫ్లై ఓవర్ నిర్మాణ పొడగిస్తామని తెలిపారు కానీ అది ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.ఇక్కడి పట్టణ పరిస్థితులు వాహనదారుల అవస్థలను గుర్తించి అప్పట్లో జాతీయ రహదారి సిద్ధాంతి కి కూత వే టు దూరం లో నక్షత్ర విల్లాస్ కు 20 అడుగుల దూరం లో మరో యు టర్న్ ను ఏర్పాటు చేశారు.ఇది కొన్ని రోజులు బాగానే ఉన్న మరి ఎందుకు గత కొన్ని నెలలు గా ఉన్న యు టర్న్ కూడా మరల మూసివేయడం మరల వాహనదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎందుకు తీస్తున్నారు .ఎందుకు మూసి వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు.
