ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎలక్ట్రానిక్స్ పరీక్ష ఫలితాల్లో..
ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎలక్ట్రానిక్స్ పరీక్ష ఫలితాల్లో..
స్టేట్ ఐదవ ర్యాంక్ సాధించిన మోటే శ్రీనివాస్ గౌడ్
జ్ఞాన తెలంగాణ, వలిగొండ:

వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మోటే రాములు సుగుణమ్మల చిన్న కుమారుడు మోటే శ్రీనివాస్ శుక్రవారం ప్రకటించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో స్టేట్ 5వ ర్యాంక్ సాధించారు.
ర్యాంకు సాధించిన శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపరచడంలో తన తల్లిదండ్రుల సహకారంతోపాటు తన సోదరుడు మోటే బాలరాజు( ఏడి)సహకారం ఎంతో ఉందని అన్నారు.
రాష్ట్రస్థాయిలో ఐదవ ర్యాంకు సాధించిన తన మిత్రునికి తన బాల్యమిత్రులు మారగోని విష్ణు గౌడ్, జేరిపోతుల సురేష్, గోళ్ల కిరణ్, ఎమ్మే వెంకటేష్ , దొంతిక మహేష్ , మైసొల్ల మచ్చ గిరి, మారగోని ఉపేందర్ , పూజారి అశోక్, ప్రముఖ గాయని యాట సంధ్య, నిమ్మల గీత, దుబ్బ నవీన్ , తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.