తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పోరాట చరిత్రతెలంగాణ ఉద్యమాలకు పురిటి గడ్డ,

తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పోరాట చరిత్ర తెలంగాణ ఉద్యమాలకు పురిటి గడ్డ,
భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి రాలేదు నిజాం పరిపాల నుంచి విముక్తి కోసమే హైదరాబాద్ స్వతంత్ర ఉద్యమం జరిగింది. 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు. ఆ తర్వాత 1956 భాషా ప్రాతిపదికన హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రం రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. 1956 నుంచి 1969 వరకు కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది. 1969 నుంచి 2000 సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన వివిధ ఉద్యమాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అణిచివేసినప్పటికీ తెలంగాణ కాంక్ష మాత్రమే ప్రజల నుండి వేరు చేయలేకపోయారు.
మన రాష్ట్రం మనం సాధించుకోవాలి అంటే తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలి అంటే నిధులు కావాలంటే నిరుద్యోగిత నిర్మూలించాలంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలనే ఉద్దేశం తోటి 2001 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ ఉద్యమ సూర్యుడు పోరాట యోధులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చారిత్రక రోజుగా గుర్తించబడింది.ఆ రోజున, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) స్థాపించబడింది.(టిఆర్ఎస్) వ్యవస్థాపకుడు, కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేయడానికి ఈ పార్టీని స్థాపించారు.(టిఆర్ఎస్) యొక్క ప్రధాన లక్ష్యాలు:హైదరాబాద్‌ను తెలంగాణ రాష్ట్ర రాజధానిగా చేయడం.తెలంగాణ ప్రజలకు సామాజిక, ఆర్థిక, న్యాయం,ప్రాంతీయ అభివృద్ధి.టిఆర్ఎస్ పోరాట చరిత్ర: టిఆర్ఎస్ రాష్ట్ర ఏర్పాటు కోసం శాంతియుత, ప్రజాస్వామ్య పోరాటాన్ని ప్రారంభించింది.పార్టీ నిరసనలు, ర్యాలీలు, బంద్‌లు మరియు ఇతర ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది.టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల మద్దతును పొందడంలో విజయవంతమైంది.
2002 టిఆర్ఎస్ నేతృత్వంలో తెలంగాణ విస్తృతస్థాయిలో నిరసనలు ఆందోళనలు ప్రారంభించింది. 2009లో తెలంగాణ ఉద్యమం మరింత తీవ్రతరమైంది అనేక ఘర్షణలు మరియు వంశాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఏర్పాటు కోసం ఒత్తిడిని తీసుకొచ్చారు నిరాహార దీక్షలు చేశారు. రాజకీయ ఆర్థిక ఉద్యోగ విద్యార్థి సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటయి. అసెంబ్లీ ముట్టడి ధూంధాం ప్రోగ్రామ్స్ ద్వారా తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని చాటి చెప్పారు. 2009వ సంవత్సరంలో టిఆర్ఎస్ 15 శాసనసభ స్థానాలను గెలుచుకుంది రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 2010 టీఆర్ఎస్ నేతృత్వంలో తెలంగాణలో 100రోజుల సమ్మె జరిగింది. 2011 ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.
1200 మంది విద్యార్థుల త్యాగాల ఫలితంగా. ఆచార్య జయశంకర్ ఆశయ సాధనలో తెలంగాణ ఉద్యమ సూర్యుడు కలవకుంట్ల చంద్రశేఖర రావు పోరాట ఫలితంగా 2013లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో చట్టం ఆమోదించబడింది.దీర్ఘకాలిక పోరాటం తర్వాత, భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది.జూన్ 2, 2014న తెలంగాణ 29వ భారత రాష్ట్రంగా అవతరించింది.కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.తెలంగాణ ఉద్యమం యొక్క ప్రాముఖ్యత:తెలంగాణ ఉద్యమం భారతదేశంలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ ఉద్యమం.ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D కింద రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది, ఇది ఒక ప్రాంతానికి ప్రత్యేక హోదాను అందిస్తుంది.
తెలంగాణ ఉద్యమం భారతదేశంలోని ఇతర ప్రాంతీయ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది.రాజకీయాలు: తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించి 2014 2018 ఎన్నికల్లో విజయం సాధించి కలవకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లో జరిగిన భారత్ పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ తొమ్మిది లోక్‌సభ స్థానాలు గెలుస్తుంది. దశాబ్ద కాలం పాటు టిఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర ఊహించి తెలంగాణ నినాదాన్ని ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంచింది.
రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి విద్యుత్ రవాణా వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కృషి చేసింది. పేదరిక నిర్మూలన సామాజిక సంక్షేమం మహిళా సాధికారత వంచ రంగాలలో అనేక పథకాలను ప్రారంభించి హైదరాబాద్ ఒక ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేసింది. ప్రభుత్వం సాగుబడి నీటిపారుదల విద్యుత్ రంగాలపై దృష్టి పెట్టింది కొత్త పరిశ్రమల ప్రోత్సహించడానికి మరియు ఉపాధి అవకాశాన్ని సృష్టించడానికి చర్యలు తీసుకుంది సంక్షేమ పథకాల ద్వారా పేదల మరియు వెనుకబడిన వర్గాల మద్దతు ఇవ్వటానికి ప్రయత్నించింది.
రైతు బీమా కల్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టింది. పేద ప్రజలకు గృహ సదుపాయాలు డబల్ బెడ్ రూమ్ నిర్మాణ విషయంలో కొంతమేరకు నిర్లక్ష్యం జరిగినప్పటికీ తెలంగాణ పథకాలలో ముఖ్యమైన పథకంగా భావించవచ్చు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న సవాళ్లు నిరుద్యోగం పేదరికం మరియు అవినీతి రాష్ట్ర ప్రజలుఎదుర్కొంటున్న ప్రధాన సవాలు. కృష్ణానది నీటిపై పరుగు రాష్ట్రాలకు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండటం మరొక సవాలుగా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన సంస్కృతి మరియు వారసత్వానికి గుర్తింపుగా రూపొందిన రాష్ట్రం. బతుకమ్మ సంక్రాంతి మరియు ఉగాది వంటి పంటలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగటం గమనార్హం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన కలలో నృత్యాలు మరియు వంటకాలు కూడా ఉన్నాయి తెలంగాణ భాష యాసలకు ప్రభుత్వం కూడా గర్వకారణం.
2019 20 మధ్యకాలంలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కీలకపాత్ర వహించి ప్రజలకు కావలసిన ఆరోగ్య సదుపాయాలు కల్పించడంలో విజయం సాధించారు. ఎంతో పోరాట చరిత్ర ఉన్న టిఆర్ఎస్ పార్టీ 2023 ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీగా రూపొందించడం ప్రజల్లో కొంత మేరకు సంతృప్తిని కలిగించాయి. టిఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత 2023 ఎలక్షన్ లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంతగా కలిసి రాలేదు అనటంలో ఎలాంటి సందేహం లేదు.
2024 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం సాధించి ప్రజల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పార్టీ కూడా కీలకపాత్ర వహించింది అన్నట్లు ఎలాంటి సందేహం లేదు. 2020 నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్ కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎలకపాత్ర వహిస్తూ తెలంగాణ ప్రజలు సమస్యల పరిష్కారం దిశవైపు పోరాటం మొదలుపెట్టడం ప్రజల్లో మరో చైతన్యాన్ని వారు చేస్తుంది. ఏమైనాప్పటికీ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయం రాజకీయం ఆర్థికంగా చరిత్రపరంగా అస్తిత్వాన్ని చాటిచెట్టులో టిఆర్ఎస్ పార్టీ కీలకపాత్ర వహించింది.(ఏప్రిల్ 27 టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా)కవి సాహితి విశ్లేషకులు పూసపాటి వేదాద్ర
