ఘనంగా కేయూ ప్రాంగణంలో సావిత్రి బా పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నాయిని

జ్ఞాన తెలంగాణ,హనుమకొండ ప్రతినిధి,జనవరి 3 :
భారతదేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే నేటితరం విద్యావంతులకు, పిల్లలు ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కాకతీయ విశ్వవిద్యాలయం ఆవరణ ఎస్ డి ఎల్ సి లో శ్రీమతి సావిత్రి బాయి పూలే గారి 194వ జయంతిని పునస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.అంతులేని వివక్షతను ఎదుర్కొంటూ ఆడపిల్లల చదువు కోసం పోరాడిన మహానుభావురాలు సావిత్రిబాయి పూలే అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి బాపూలే జయంతిని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా అధికారికంగా ప్రకటించడం సంతోషకరమైన పరిణామణి అన్నారు. మహిళల హక్కుల కోసం,సమాజంలో మహిళలకు ప్రాథమిక హక్కు అని పోరాడిన సావిత్రి బాపూలే ఆలోచన విధానాలకు అనువులంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మహిళా విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలల స్థాపన కోసం ఆమె ఎంతగానో కృషి చేశారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సావిత్రిబాపూలే చిత్రపటానికి కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య, జి డబుల్ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే నివాళులర్పించారు. అలాగే పాల్గొని మహిళ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు ఇ వి శ్రీనివాసరావు, కేయూ వైస్ ఛాన్సలర్ ప్రతాపరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయినిలక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, కేయూ ఈ సీ మేంబర్ చిర్ర రాజు, కట్ట రఘు పాల్ రెడ్డి,రాజమల్లరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.