మావోయిస్టు బంద్ నేపథ్యంలో రహదారిపై అడ్డంగా చెట్లు

మావోయిస్టు బంద్ నేపథ్యంలో రహదారిపై అడ్డంగా చెట్లు
జ్ఞాన తెలంగాణ/ భద్రాద్రి/ చర్ల న్యూస్. మే 26
మావోయిస్టు బందు నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పలు దుశ్చర్యలకు పాడ్పడ్డారు. చెట్లను నరికి రోడ్డుపై వేసి బందు పాటించాలని పిలుపునిచ్చారు.బూటకపు ఎన్కౌంటర్లకు పిలుపునిస్తూ ఆదివారంబందుకు పిలుపునిచ్చిన మావోయిస్టులో శనివారం రాత్రి చర్ల మండలం పూసగుప్ప వద్దిపేట మధ్యలో రోటెంత వాగు వద్దచెట్లు నరికి వంతెనకి ఇరువైపులా పడవేశారు. బందును విజయవంతంగా చేయాలని మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కరపత్రాలు వేశారు. అలాగే చత్తిస్ ఘడ్ సుకుమా జిల్లా, బీమాపురం గ్రామంలో ఒక ఇంటిలో పోలీసుల కోసం మావోయిస్టులో దాచిన మందు పాతర పేలి ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.