కోట్లాది రూపాయల అటవీ సంపదను కొల్లగొట్టకపోవడంలో భాగమే ఆదివాసీలపై హత్యాకాండ..

ఆర్. జనార్ధన్ ఐ ఎఫ్ టి యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 19

అడవులను నమ్ముకొని,దేశ అటవీ సంపదను రక్షిస్తున్న ఆదివాసి ప్రజలను అత్యంత కిరాతకంగా, ఆపరేషన్ కగార్ పేరుతో హత్యాకాండ కు పాల్పడడం, కోట్లాది రూపాయల అటవీ సంపదను అంబానీ, అదాని తదితర సంపన్న దోపిడీ వర్గాలు కొల్లగొట్టకపోవడంలో భాగంగానే, బిజెపి కేంద్ర మోడీ, చత్తీస్గడ్ ప్రభుత్వాలు కలిసి కొనసాగిస్తున్న దారుణ మారణకాండ అని ఇలాంటి దుర్మార్గపు చర్యలను వెంటనే నిలిపివేయాలని
ఐ ఎఫ్ టి యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్ధన్ కేంద్ర బీ జే పీ మోడీ, ఛత్తీస్గడ్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు మోడీ దుర్మార్గపు చర్యలను తీవ్రంగా నిరసించాలని కోరారు.
ఆదివారం నాడు యాదగిరిగుట్ట మండలం కాచారం,చిన్న గౌరాయపల్లి లలో హమాలీ,చేనేత కార్మికులు 138 వ,మేడే ను జరిపారు.
చికాగో కార్మిక అమర యోధులకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా విప్లవ జోహార్లు తెలిపారు.
పదేండ్ల బీ జే పీ మోడీ ప్రభుత్వం కార్మికులకు ఏమీ చేయకపోగా,వారు పోరాడి సాధించుకున్న సుమారు 29 చట్టబద్ధ హక్కులను,కార్మిక చట్టాలను రద్దు చేసిందని,కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్ లను ముందుకు తెచ్చి,యాజమాన్యాలు కార్మికుల శ్రమను యదేచ్ఛగా దోచుకునే విధంగా కుట్రలకు పాల్పడిందని,కార్మికులకు తీరని ద్రోహం తలపెట్టిందని ఆరోపించారు.
2024 జూన్ లో కేంద్రంలో ఏ ప్రభుత్వం అదికారంలోకి వచ్చినా,ప్రజల పట్ల ఆ ప్రభుత్వ వైఖరి, విధానాల మీద ఆధారపడి పోరాట కార్యక్రమాలను రూపొందించుకొని పొరడక తప్పదని,వాలని,అందుకు కార్మిక వర్గం సిద్ధపడాలని, అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజా, కార్మికోద్యమాలను తీవ్రతరం చేయాల్సి ఉంటుందనితెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్,హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఇప్ప బిక్ష పతి, సుంచు ఆంజనేయులు, బిబినగరం బాబు, సుంచు రాములు, గ్యార మాతయ్య, నమిలే యాదగిరి గ్యార నరసింహులు కళ్లెం మహేందర్,దడిగే సిద్ధులు, పారెళ్లి సురేష్, బాల్డ్దే చంద్ర మౌళి, నమిలే ఎల్లయ్య, వంగపల్లి యాదగిరి, గ్యార మహేందర్, సుంచు బాలయ్య, నరేందర్, ఏనుగుల ఎల్లయ్య, తాడేమ్ పాండు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »