సమయపాలన లేని సర్కారీ బస్సు ప్రత్యేక కథనం కొడకండ్ల

సమయపాలన లేని సర్కారీ బస్సు ప్రత్యేక కథనం కొడకండ్ల
తేదీ: 20-05-2024 కొడకండ్ల మండల కేంద్రం నుండి తొర్రూర్ డిపోకు చెందిన హనుమకొండ బస్సు గత కొద్ది సంవత్సరాలుగా రెగ్యులర్ సెటిల్ బస్ గా ఉండుకుంటూ కొడకండ్ల ప్రజలకు ఎంతో చేరువగా ఉండేది. గత కొద్ది కాలంగా తొర్రూర్ బస్సు నడపకుండా మానివేయడం జరిగింది. ఎందుకు అని అడగగా హనుమకొండ బస్టాండ్ లో తొర్రూరు బస్సుకు పాయింట్ ఇవ్వకుండా హనుమకొండ డిపోకు చెందిన బస్సును సెటిల్ గా నడపడం జరుగుతుంది. అలాంటి సమయంలో రెగ్యులర్గా తొర్రూర్ నడిచేటువంటి బస్సు నడపడం మానివేయడం జరిగింది. అప్పటినుండి కొడకండ్ల ప్రజలకు కష్టాలు అనేటివి మొదలు కావడం జరిగింది. ఎందుకనగా ఉదయం హనుమకొండ నుండి 11 గంటలకు బయలుదేరి కొడకండ్లకు వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు వచ్చి తిరుమలగిరి కి వెళ్లి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు కొడకండ్లకు రావలసిన బస్సు సరైన టైంలో రానందున ప్రయాణికులు అసలు బస్సు ఉన్నదా లేదా అనే సందిగ్ధంలో ఉండి అయోమయానికి గురికావలసి వస్తుంది కావున దీనిపైన హనుమకొండ డిపో వారు స్పందించి సమయానికి బస్సును నడప వలసిందిగా కొడకండ్ల ప్రజల యొక్క ఆకాంక్ష.