రైతు బీమా దరఖాస్తుకు రేపు ఒక్కరోజే ఛాన్స్

రైతు బీమా దరఖాస్తుకు రేపు ఒక్కరోజే ఛాన్స్


రైతులకు ముఖ్యమైన అలర్ట్. రైతు బీమా దరఖాస్తుకు ఒక్కరోజే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్‌బుక్కులు పొందిన రైతులకు రైతు బీమా పథకం అమలు కోసం ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్యలో జన్మించి, ఈ సంవత్సరం జూన్ 5వ తేదీ నాటికి పాస్ పుస్తకం పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుతోపాటు పట్టాదారు పాస్‌బుక్, రైతు ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డులను ఏఈవోకు అందజేయాలి.

You may also like...

Translate »