రేపే మహాత్మా జోతిరావు ఫూలే 198 వ జయంతి

రేపే మహాత్మా జోతిరావు ఫూలే 198 వ జయంతి.
మహాత్మా జ్యోతిభా ఫూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు పూలే జననం 1827 వ సంవత్సరం ఏప్రిల్ 11 వ తేదీ , మరణం 1890 ఏప్రిల్ 28 వ తేదీ.సుప్రసిద్ధ భారతీయ సామాజిక కార్యకర్త, ఆలోచనాపరుడు, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మరియు రచయిత. ఫూలే అంటరానితనం నిర్మూలన కోసం పనిచేశాడు. మహిళలు మరియు అణగారిన కులాల ప్రజలలో విద్యావ్యాప్తికి తన కృషిని కొనసాగించాడు. ఫూలే తన భార్య సావిత్రిభాయి ఫూలేతో కలిసి 1848లో పూణెలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించాడు. ఫూలే , అతని అనుచరులు, అట్టడుగు కులాల ప్రజలకు సమాన హక్కులను సాధించడానికి సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించారు. భారతదేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమంలో ఫూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.ఈరోజు ఫూలే 198 వ సందర్భంగా ఆయనను స్మరించుకుందాం.

జనవరి 1 వ తేదీ భారత దేశంలో మహిళల బ్రతుకులలో సమూలమైన మార్పుకు బీజం పడిన రోజు.
చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే తన భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి సహకారంతో మొట్ట మొదటి బాలికల పాఠశాల 1848 జనవరి 1 న మహారాష్ట్ర లోని పూణేలో ప్రారంభించడం జరిగింది. ఆరోజు నుండి క్రమక్రమంగా ఆడపిల్ల చదువుకోవడం ప్రారంభించారు.ప్రతి ఆడబిడ్డ(వారు ఏ కులమైన, ఏ మతం వారైనా) ఆ మహాతల్లికి రుణపడి ఉన్నారు. ఈ పాఠశాలల ప్రారంభానికి ముందు మహిళలకు చదువుకునే హక్కు లేదు. ఇంటి వంట పనికి మాత్రమే పరిమితమయ్యారు.మహిళలు చదువుకున్నచో బుద్ధిలేని వారు అవుతారనే ఆచారం ఉండేది. అలాంటి బానిస సంకెళ్ళను తెంచడానికి మహాత్మా జోతిరావు-సావిత్రి బాయి ఫూలే దంపతులు కృషి చేశారు.

మహాత్మా జోతిరావు ఫూలేను మార్చిన పుస్తకం “మానవ హక్కులు”
బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆధునిక కాలంలోని తన గురువుగా మహాత్మా జోతిరావు ఫూలేను ప్రకటించుకుని ఆయన బాటలో నడిచారు.మహాత్మా జోతిరావు ఫూలే మెట్రిక్యులేషన్ చదువు పూర్తి అయిన తరువాత అమెరికా రాజకీయ వేత్త,తత్త్వవేత్త అయిన థామస్ పేన్ రచించిన ‘హ్యూమన్ రైట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిని పొందారు.మానవ హక్కులు నిరాకరించిన హిందూ మనువాద అధర్మంపై జీవితాంతం పోరాటం నడిపారు.భారతదేశంలో చదువు అందరికీ ఆనాడు అందుబాటులో లేదు. దీనికి గల కారణం బ్రాహ్మణిజం.ఈ బ్రాహ్మణిజం కుట్రలను ఫూలే పసిగట్టారు.అందరికీ విద్య కోసం, కులవ్యవస్థను రూపుమాపేందుకు ఫూలే అహర్నిశలు పోరాడారు.థామస్ పేన్(Thomas Paine) రచించిన “రైట్స్ ఆఫ్ మ్యాన్” పుస్తకం చదివిన జోతిరావు ఫూలే మన భారతదేశంలో దోపిడీకి, అమానుషత్వానికి,అసమానతలకు, వర్ణ కుల వ్యవస్థకు కారణమైన బ్రాహ్మణ మను ధర్మానికి వీడ్కోలు పలికారు.మహాత్మా జోతిరావు ఫూలే 1863 వ సం౹౹రం సెప్టెంబరు 24 వ తేదీన “సత్య శోధక సమాజం” ఏర్పాటు చేశారు.సమాజ పరివర్తన కోసం ఫూలే కృషి చేశారు.గొప్ప పుస్తకాలు చదవడం వలన మనం గొప్ప వ్యక్తులతో మాట్లాడిన భావన కలిగి మనం కూడా గొప్ప వారిలాగ మారగలం.ఎంతో విలువైన గొప్ప వ్యక్తుల ఆలోచనలు మన మీద ప్రభావం చూపుతాయి.ఈ రోజు ప్లిప్ కార్డులో నేను కూడా థామస్ పేన్(Thomas Paine) రచించిన ” రైట్స్ ఆఫ్ మ్యాన్(Rights Of Man)” పుస్తకం తీసుకున్నాను.మనం డబ్బులు ఎంతో వృథా చేస్తుంటాం..కానీ పుస్తకాలు మాత్రం కొనడం లేదు. పుస్తకాలు మాత్రమే నిజమైన మన నేస్తాలు మిత్రులారా…గొప్ప వ్యక్తులు వ్రాసిన పుస్తకాలు మనోమాలిన్యాలను తొలగించి మనకు జ్ఞానం అందించి అజ్ఞానం, అవిద్యలో ఉన్న మన మనో నేత్రాలను తెరిపిస్తాయి.1873 వ సంవత్సరం సెప్టెంబరు 24 వ తేదీన పూణేలో జోతిరావు ఫూలే సత్యశోధక్ సమాజ్ స్థాపించారు.ఫూలే సమాజంలో బ్రాహ్మణ ఆధిపత్య వర్గాలకు ప్రత్యామ్నాయ సంస్కృతి తీసుకుని రావడానికి కృషి చేశారు. ఈ నేపథ్యంలో 1880 వ సంవత్సరం జనవరి 8 వ తేదీన మహాత్మా జోతిరావు ఫూలే “సత్యశోధక్ సమాజ్” ఆధ్వర్యంలో బ్రాహ్మణ పురోహితులు లేకుండా చేసిన వివాహాలు చట్టబద్ధమైనవని ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. వివాహాలు బ్రాహ్మణేతరులు కూడా నిర్వహించవచ్చని కోర్టు అంగీకరించింది.మహాత్మా జోతిబా ఫూలే చే భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా శూద్రులు కోసం పాఠశాల ప్రారంభించబడింది.
“నాతోరా సంశయాత్ముడా ఒకప్పుడు
మను ఆజ్ఞలతో హీనస్థితిని పొందినవాడా
విద్య నీకు సంతోషాన్ని నేర్పతుంది
జోతి చెప్తున్నాడు దృఢనిశ్చయంతో”
మహాత్మా జోతిరావు ఫూలే ఈ విధంగా మనుస్మృతిపై పంతం చేసి బహిరంగంగా అన్నారు.
మన భారతదేశంలో సనాతన ధర్మం, హిందూ మతం అంటూ గొప్పలు చెప్పుకునే మత ఉన్మాదులు,హాఫ్ నాలెడ్జ్ గలవాళ్ళు ఈ మధ్య ఎక్కువైపోతున్నారు.ఇలాంటి వారికి ఏ మాత్రం అసలు చరిత్ర తెలియదు..చదివే ప్రయత్నం కూడా చేయరు.కనీసం ఓ యూనివర్సిటీలో పిజీ కూడా చేయకుండా మూర్ఖత్వంతో ఉన్మాదంతో ఊగిపోతుంటారు.ఇలా వాళ్ళను తయారు చేస్తున్న వాళ్ళు ఆర్ ఎస్ ఎస్-బిజెపి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాలు వాళ్ళు మరియు ఎగువ శూద్రులలో కొందరు కమ్మ, రెడ్డి, వెలమలు కలిసి బిసీలను బాగా హిందూ మతం పేరుతో ఉన్మాదులుగా తయారు చేసేసారు. అసలు చరిత్ర గానీ, వాస్తవాలు గానీ, సైన్స్ గానీ ఇంక అవసరం లేదు. హిందూ మతమే గొప్పది.అంతా హిందూమతమే అంటూ ఇంకేం ఆలోచించనీయకుండా తయారు చేసి, వాళ్ళ ప్రయోజనాల కోసం మెజారిటీ ప్రజలను మలుచుకుంటున్నారు.కాబట్టి అరమెదడు గాళ్ళు అయిన ఓ శూద్ర, అతిశూద్ర ప్రజలారా వాస్తవాలు తెలుసుకోండి.
మన దేశంలో మూడు వేల సంవత్సరాలకు ముందు సమాజంలో కింది వర్గాల వాళ్ళు పాఠశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు.విదేశీ ఆర్యులు వలన వర్ణ వ్యవస్థ ప్యవేశపెట్టబడింది.మనుస్మృతి అనే గ్రంథాన్ని రచించి దాని ప్రకారం సమాజంలో నాలుగు వర్ణాలు ప్రవేశ పెట్టారు. ఐదవ వర్ణం పంచములు అని పేరుతో ఊరికి దూరంగా నెట్టేసి వాళ్ళను అస్పృశ్యత పేరుతో మానవ హక్కులు లేకుండా చేశారు. కేవలం త్రివర్ణాలు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు మాత్రమే చదువుకోవాలని మనుస్మృతి చెబుతోంది. మహిళలు ఏ వర్ణం వారైనా సరే చదువుకోవడం మనుస్మృతి ప్రకారం నేరం.అలాంటి అమానవీయ మనుస్మృతి అమలుజరిపారు.శూద్రులు ఆయుధం ధరించరాదని శాసనాలు అమలుజరిపారు. భారతీయ సమాజం ఇలా ముక్కలు చేయడంతో బ్రిటిష్ వారు ఈ దేశంలో రావడానికి మార్గం సులువైంది.దానికి తోడూ ఈ ఆర్య వర్ణాల వారు బ్రిటిష్ వారిని ఎదిరించడానికి సిద్ధ పడకపోగా వాళ్ళతో కలిసి మనదేశంలో ప్రజలను దోచుకోవడానికి పన్నాగం పన్నారు.శూద్రులకు ఆయుధాలు ఇవ్వకపోవడంతో బ్రిటీష్ వారికి మన స్వదేశీ రాజ్యాలను జయించడం తేలిక అయింది. ఇక ఆర్యులు బ్రిటీష్ వారితో భాగస్వామ్యం వహించి ఈ దేశంపై పెత్తనం చేయడానికి సహకారాన్ని అందించారు. ఇలాంటి నేపధ్యంలో బ్రిటిష్ వారు అందరికీ విద్యను ప్రవేశ పెట్టడంతో ఆర్యులైన బ్రాహ్మణులు ఏకమై మనుస్మృతిని కాపాడుకోవడం కోసం దేశభక్తి ముసుగులో స్వాతంత్ర్య పోరాటాన్ని సాగించారు. ఇది పసిగట్టలేని అమాయక మెజారిటీ శూద్రాతిశూద్రులు,ఈ దేశ ముస్లింలు ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడకుండా స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొన్నారు. ఆర్యబ్రాహ్మణ శక్తులు అధికారమే పరమావధిగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేశారు.

మహాత్మా జోతిరావు ఫూలే కానీ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు కానీ అందుకే కృత్రిమ మైన ఈ స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొనలేదు. దానికన్నా ముందు ఈ విదేశీ ఆర్య బ్రాహ్మణ వాదులపై పోరాటం చేశారు. మనుస్మృతి అంతం కోసం పోరాటం చేశారు.
జూలై 3 వ తేదీన 1851వ సంవత్సరం లో మహాత్మా జోతిరావు ఫూలే బుధవార్ పేటలో అన్నా సాహెబ్ చిప్లంకరు వాడలో ఎనిమిది మంది బాలికలతో బాలికల పాఠశాల స్థాపించారు.కొద్దిరోజులలోనే ఈ బాలికల పాఠశాలలో 48 మంది బాలికలు చేరారు. మహాత్మా జోతిరావు ఫూలే తన భార్య సావిత్రి బాయి ఫూలేలు కలిసి ఈ పాఠశాలలో పాఠాలు బోధించారు.ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొంటూనే ఫూలే దంపతులు బాలికల కోసం, శూద్రులు, అతిశూద్రుల కోసం పాఠశాలలు ప్రారింభించారు.భారత చరిత్రలోనే గొప్ప మహత్తర కార్యం మహాత్మా జోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలేలు చేశారు. ఏ జాతులు వారికైతే మనుస్మృతి పేరు తో చదువుకోరాదని ఆంక్షలు పెట్టారో ఆ శూద్రాతిశూద్రులు ,మహిళలు కోసం మహాత్మా జోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలేలు అహర్నిశలు శ్రమించి వాళ్ళకు పాఠశాలలు ద్వారా, రాత్రి బడులు ద్వారా, అనాథ శరణాలయాలు స్థాపించి, వితంతు శరణాలయాలు స్థాపించి వాళ్ళ బతుకులు మార్చారు. దుర్మార్గపు మనుస్మృతిని ధిక్కరించారు.ఎలాంటి ఆస్తులు ,భూములు, గవర్నమెంట్ ఉద్యోగం లేకుండానే మహాత్మా జోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలేలు ఈ దేశంలో ఉన్న మెజారిటీ శూద్రులు ,అతి శూద్రులు,మహిళలు కోసం తమ జీవితాలను త్యాగం చేసి ,సమయాన్ని వెచ్చించి, కష్టాలు పడుతూ పని చేశారు. ఆనాడు ఆ దంపతులు చేసిన కృషి, త్యాగాలు, పోరాటాలు వలనే సమాజంలో మార్పులు వేగవంతమై అందరికీ చదువు వచ్చింది, మహిళలు చదువుకోవడం జరుగుతుంది. మనుస్మృతి గనుక ఇంకా ఉండి ఉంటే మన సమాజం ఇంకా వెనక్కి వెళ్ళిపోయేది.
మూర్ఖులుగా మతం మత్తులో ఉన్మాదులుగా మారుతున్న భారతీయ ప్రజలలో చైతన్యం కలుగు గాక.మనువాద భావజాలంలో ఉన్న భారతీయుల మెదడుకు బ్రాహ్మణ వాదులు ,ఆర్ ఎస్ ఎస్ ,బిజెపి శక్తులు వేసిన సంకెళ్ళ నుండి విముక్తి కలగాలి అంటే మహాత్మా జోతిరావు ఫూలే “గులాంగిరి” ,బాబాసాహెబ్ అంబేడ్కర్ వ్రాసిన “హిందూ మతంలో చిక్కుముడులు” అన్న పుస్తకాలు చదవాలి.చారిత్రక సత్యాలను దాచి సనాతన ధర్మం, హిందూ మతం అంటూ మనల్ని మోసగిస్తున్నారు.తద్వారా దోపిడీ చేయడం ,అధికారం, హోదా ,సంపద పొందడం ఆర్యులైన మనువాదుల విధి.అందువల్ల అసలైన చరిత్రను మన మూలాలను తెలుసుకోవడానికి మనం నిరంతరం ప్రయత్నం చేయడం మన విధి.
అసలైన మహాత్మా జోతిబా ఫూలే రచనలు చదవండి….చదివించండి..
హంటర్ కమీషన్ కు వినతిపత్రం సమర్పించిన ఫూలే.
మహాత్మా జోతిరావు ఫూలే ఉపాధ్యాయుడు.మన దేశానికి సావిత్రి బాయి, షేక్ ఫాతిమా లాంటి మహిళలను మొట్టమొదటి ఉపాధ్యాయినులుగా శిక్షణ ఇచ్చి అందించిన మహా మహోపాధ్యాయుడు, గొప్ప సంఘసంస్కర్త.జోతిరావు ఫూలే స్త్రీ విద్య కోసం ఎంతగానో కృషి చేసారు.బ్రిటిష్ ప్రభుత్వం 1882 లో సర్,విలియమ్ హంటర్ అధ్యక్షతన ఒక కమిటీను నియమించారు. దానికి హంటర్ కమీషన్ అని పేరు. సామాజిక రంగాలలో మేధావుల విద్యావంతుల అభిప్రాయాలను సేకరించి విద్యారంగంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావాలనే ఉద్ధేశంతో ఈ కమిషన్ సభ్యులు హంటర్ నాయకత్వంలో మన భారతదేశంలో నలుమూలలో పర్యటించారు.1882 అక్టోబర్ 19 నహంటర్ కమీషన్ కు ఫూలే తనను తాను ఒక సాధారణమైన వ్యాపారస్తునిగా, ఒక రైతు బాంధవునిగా పరిచయం చేసుకున్నారు. ఆనాడు బ్రిటీష్ పాలకులు విద్యారంగంలో ప్రవేశపెట్టదలచిన ‘ఫిల్టర్ ధియరీని’ మహాత్మా పూలే వ్యతిరేకించారు.
బ్రిటిష్ ప్రభుత్వం మనదేశంలో విద్యావ్యాప్తి కోసం అగ్రకులాల వారు క్రింది కులాల వారికి విద్యను బోధించాలి అంటూ సలహాలు ఇవ్వగా ఫూలే ఇది జరగని పని అని వ్యతిరేకించారు. ఎందుకంటే మనదేశంలో అగ్రకులాల వాళ్ళే కులవ్యవస్థను సృష్టించి క్రింది కులాల వారికి విద్యను నిషేధించారు. అగ్రకులాల వాళ్ళు శూద్రులు మరియు అతిశూద్రులు కొరకు ఏ విధమైన మేలు చేయలేదు అని ప్రశ్నించారు. బ్రాహ్మణ దోపిడీ పురోహిత వర్గం ఈ దేశంలో శూద్రులు మరియు అతిశూద్రులను అణిచివేతకు గురి చేసి సమాజానికి దూరంగా నెట్టేశారు.ఫూలే ప్రాథమిక విద్యను సామాన్య జనాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని తొలిసారిగా ప్రతిపాదించారు. హంటర్ కమీషన్ కు చెప్పి ఈ ప్రతిపాదన అంగీకరించేట్టు ఫూలే పోరాటం చేశారు.ఫూలే వంటి మహనీయుడు యొక్క చరిత్రను బ్రిటిష్ సమాజ పరిశోధకురాలు ‘రోజ్ లిండ్’ మరియు ఆస్ట్రేలియా జాతీయురాలు ‘గేల్ ఓమ్ వెట్’ వంటి వారు పరిశోధనలు చేసి ఫూలే గురించి ఆయన సిద్ధాంతాలను గురించి తెలియచేశారు.
దాచబడిన శివాజీ చరిత్రను మనకు తెలియచేసిన ఫూలే :
బ్రాహ్మణ మనువాదులు ముస్లింలతో జతకట్టి ఛత్రపతి శివాజీను చంపారు.బ్రాహ్మణ మనువాదులు ఛత్రపతి శివాజీ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేయగా మహాత్మా జోతిరావు ఫూలే రాయఘడ్ లో ఉన్న శివాజీ సమాధిని కనుగొని సత్య శోధక సమాజం ఆధ్వర్యంలో మొదటిసారిగా శివాజీ జయంతి ఉత్సవాలను జరిపారు.చరిత్ర పరిశోధకుడు, సంస్కర్త,ఆధునిక సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే తొలిసారిగా 1880 లో శివాజీ జయంతి సభలు జరిపారు.మహాత్మా జోతిరావు ఫూలే 1869లో శివాజీ మహారాజ్ ను కీర్తిస్తూ ఆయనపైన పొవాడ(మరాఠి సాంప్రదాయ కీర్తన)కూడా వ్రాసాడు…శివాజీకి తన తల్లి జిజియాబాయి అడుగుజాడల్లో నడిచి,తల్లి నేర్పిన గుణాలతో రాజ్యంలో స్త్రీలపైన వివక్షత లేకుండా, అందరినీ సమానంగా చూస్తూ, కుల,మతపరమైన బేధాలు లేకుండా రాజ్యాన్ని పాలించారు. తమ స్వార్థపు రాజకీయ స్వలాభం కోసం ఏ వర్గాలైతే కుట్రలు చేసి శివాజీను చంపారో ఇప్పుడు మళ్ళీ అదే శివాజీని తమకి అనుకూలంగా వ్రాసుకొని బహుజనులను రాజ్యానికి దూరం చేస్తున్నారు…ఛత్రపతి శివాజీ మహారాజ్ ,ఛత్రపతి సాహు మహారాజ్ ,మహాత్మా జోతిరావు ఫూలే వీరి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
ఫూలే ఆదర్శం: డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి తండ్రి రాంజీ సక్పాల్ గారు మాలోజి మహాత్మా జోతిరావు ఫూలే గారి శిష్యుడు.మహాత్మా జోతిరావు ఫూలే గారి యొక్క కాలం 1827 నుండి 1890.సమాజంలో అసమానతలకు కారణం కుల వ్యవస్థ,మనుధర్మం.ఆనాటి సమాజంలోని ఈ అన్యాయలు పైనా , అసమానతల పైనా మహాత్మా జోతిరావు ఫూలే ఉద్యమం చేసారు.సమాజంలోని కింది వర్గాల వారు చదువుకోవాలి అని జోతిరావు ఫూలే చెప్పిన మాటను రాంజీ ఆచరణలో పెట్టారు.రాంజీ గారు ఫూలే మాటను ఆచరించ బట్టే ఈ దేశానికి ఒక గొప్ప మేధావిని ,నవ బుద్ధుడిని అందించ గలిగారు.డా.అంబేడ్కర్ గారికి మహాత్మా జోతిరావు ఫూలే గారంటే చాలా ఎక్కువగా ప్రేమ,గౌరవం.అయితే అంబేడ్కర్ గారి కాలం 1891 నుండి 1956.అంబేడ్కర్ -ఫూలే లు ఒకరికొకరు సమకాలికులు కాదు.కాబట్టి అంబేడ్కర్ గారికి ఫూలే గారిని చూసే అవకాశం లేదు..అంబేడ్కర్ గారిపై బుద్దుడు ,కబీర్ ల తర్వాత ఫూలే నిర్వహించిన సామాజిక పరివర్తన ఉద్యమం ప్రభావం ఎక్కువగా ఉంది.అందుకే ఫూలే చేపట్టిన ఉద్యమాన్ని అంబేడ్కర్ కొనసాగించారు అని చెప్పొచ్చు.అంబేడ్కర్ గారు స్వయంగా నా గురువులలో ఫూలే ఒకరు అని చెప్పారు కూడా.అంబేడ్కర్ గారు వ్రాసిన “శూద్రులెవరు ?” అనే గ్రంథాన్ని మహత్మా జోతిరావు ఫూలే గారికి అంకితం ఇచ్చారు.అంబేడ్కర్ గారికి నిరంతర అధ్యయనం,ఉద్యమం వలన ఆయనకు ఫూలే గురించి పుస్తకాలు వ్రాసే అవకాశం లేకుండా పోయింది,లేదంటే ఫూలే గారి జీవిత చరిత్ర వ్రాసే వారు కూడా.
మహాత్మా జోతిరావు ఫూలే గురించి డా.బి.ఆర్.అంబేడ్కర్ భావనలు…..
“ఉన్నత వర్గాలకు బానిసవర్గాలు చేస్తున్న ఊడిగాన్ని బానిస వర్గాలకు అనుభవపూర్వకంగా తెలియజేసిన ఉత్తమ శూద్రుడు ఫూలే.” అని, విదేశీ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కంటే స్వదేశీ పీడకుల బానిస సంకెళ్ళను తెంచుకోవడం ముఖ్యమనే మూలకారణాన్ని తనకు బోధించిన గొప్పవ్యక్తి ఫూలే అని డా.అంబేడ్కర్ ఫూలేని పొగుడుతారు. రాజకీయ హక్కులు, రాజకీయ అధికారం లేకుండా పీడిత ప్రజల అభివృద్ధి సాధ్యం కానేకాదన్న డా.అంబేడ్కర్ పీడిత ప్రజలు తమ శక్తినీ, వనరులనూ, రాజకీయాలను, విద్యను పొందేందుకు ఉపయోగించాలని చెప్పారు. మూఢనమ్మకం, ఆలోచన, తెలివిలేని ఆచరణ కన్నా దేనిని సాధించాలన్నా విశ్వాసం, హేతుబద్ధత అవసరమన్నారు. సామాజిక ఆంక్షలపై పోరాటమే నా మతం అన్నారు.
జోతిరావు ఫూలేకు మహాత్మా బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?
జోతిరావు ఫూలేకు మహాత్మా బిరుదు అంత సులువుగా రాలేదు.ఆర్య బ్రాహ్మణులు మనుధర్మశాస్త్రం ప్రకారం శూద్రులకు అన్ని హక్కులూ నిషేధించి శూద్రులను ,అతి శూద్రులను కేవలం బానిసలుగా చేశారు.మనుధర్మశాస్త్రం ప్రకారం శూద్రులు భూమి కలిగి ఉండకూడదు.ఈ నేపథ్యంలో జోతిరావు ఫూలే బ్రాహ్మణ భావజాలానికి వెన్నుదన్నుగా ఉన్న మనుధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించారు. తన ” సత్య శోధక్ సమాజం ” ద్వారా ప్రజలలో సమానత్వం గురించి మానవ హక్కులు గురించి అవగాహన కలిగించారు.”శూద్రులు ఒకప్పుడు క్షత్రియులు” అంటూ శూద్రులు, అతిశూద్రులలో బ్రాహ్మణులచే దాచబడిన వాస్తవ చరిత్రను గురించి ప్రచారం చేశారు.భూమి, విద్య అందరికీ సమానంగా అందాలి. అందుకోసం జోతిరావు అహర్నిశలు తన ప్రాణాలకు బ్రాహ్మణ మనువాదులు నుండి ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా పోరాటం చేశారు.
1888 సంవత్సరం మే నెల 11 వ తేదీన జోతీరావు ఫూలే కు మహాత్మా బిరుదుతో సన్మానం చేయాలని ప్రయత్నం జరిగినప్పుడు కూడా పీష్వా బ్రాహ్మణులు ఎలాగైనా ఆరోజున ఫూలేకు ఆ బిరుదు ఇవ్వకుండా చేయడానికి ఎన్నో ఆటంకాలు సృష్టించారు.ఎందుకు అంటే మహాత్మా అనే పదం బ్రాహ్మణులకే దక్కాలి తప్ప శూద్రులకు దక్కరాదనే దురుద్ధేశం ,ఆధిపత్య మనస్తత్వం బ్రాహ్మణ మనువాదులది.జోతీరావు ఫూలేకు మహాత్మా బిరుదుతో పాటుగా 24 వేల రూపాయలు వార్షిక విరాళాన్ని బరోడా మహారాజు సయాజీరావు ఇస్తున్నట్లు గ్రహించిన బ్రాహ్మణులు వెంటనే రాజును కలుస్తారు. కలిసి అమెరికా లో నల్లజాతి ప్రజల కోసం ‘బుకర్ టి.వాషింగ్టన్’ పోరాటం చేసినట్లు ఈ దేశంలో అంటరానితనం ,వెనుకబడిన తరగతుల ప్రజల కోసం శూద్రుడైన జోతీరావు ఫూలే పోరాటం చేసినందుకు గానూ ‘ఇండియన్ బుకర్ టి.వాషింగ్టన్’ అనే బిరుదు ఇవ్వాలని సయాజీరావు పై ఒత్తిడి తెస్తారు. అంటే బ్రాహ్మణ మనువాదులు ఎంతగా బ్రిటిష్ పాలనా కాలంలో కూడా రాజులను తమ ఆధీనంలో పెట్టుకొనేవారు అనడానికి ఇదొక ఉదాహరణ.బ్రాహ్మణ మనువాదులు అంతటితో ఆగలేదు. జోతీరావు ఫూలే బొంబాయి చేరకుండా దారిలోనే వీలైతే దాడి చేయడానికి గూండాలను కూడా పురమాయించారు.ఫూలే కు వేసే పూలమాలలో సైతం విషం గల కీటకాలు లేదా మిన్నాగులు కూడా పెట్టడానికి ప్రయత్నాలు కూడా చేసారు. ఈ విషయం తెలిసిన సత్యశోధక్ సమాజ్ సభ్యులు ఫూలేకు అండగా నిలిచారు. కర్రలు పట్టుకుని ఫూలేను వేదిక మీదకు తీసుకుని వచ్చారు. జోతీరావు ఫూలే ఏ కార్యక్రమం చేసినా తన భార్య సావిత్రి బాయి తో కలిసే చేసేవారు. అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ఈసారి జోతీరావు ఫూలే ఒక్కడిగానే ఈ కార్యక్రమానికి వచ్చారు. సయాజీరావు రాజు కూడా ప్రజలు అందరూ ” మహాత్మా ” అని గట్టిగా చప్పట్లతో జోతిరావు ఫూలే ను పిలవడంతో తన ఆలోచనని వెనక్కి తీసుకోక తప్పలేదు.సభలో తొక్కిసలాట జరిగింది. ప్రజలు మహాత్మా! మహాత్మా ! అంటూ నినాదాలు చేశారు. ఇదీ అసలైన మహాత్మా బిరుదు వెనుక ఉన్న వాస్తవ సంఘటన. బొంబాయి లోని మాండ్వీ ప్రాంతంలో కొలివాడ హాలులో ఈ మహాత్మా బిరుదును ప్రజలు జోతిరావు ఫూలే కు ఇచ్చారు. బరోడా మహారాజ్ సయాజీరావు కూడా ప్రజలు జోతిరావు ఫూలే పట్ల ఏర్పరచుకున్న అభిమానానికి తలవంచక తప్పలేదు.
బ్రాహ్మణులు తమ మత గ్రంథాలను బయటికి తీయాలి – ✍️మహాత్మా జోతిరావు ఫూలే సవాల్ విసిరారు.
ఫూలే మాటలలో “క్రైస్తవులు సమావేశమై… బైబిల్ చదువుకుని, దేవుని యెడల వినమ్రులవుతారు. కృతజ్ఞులవుతారు. ముస్లింలు కూర్చుని, ఖురాన్ పఠించి, ఆధ్యాత్మిక కాంతుల్ని మనసు నిండా నింపుకుని పరవశులవుతారు.మరి హిందువుల పరిస్థితి ఏమిటి? హిందువులు అంతా కలిసి, పవిత్ర గ్రంథాలు పఠించలేరు. హిందువుల్లోనే అత్యధికులకి వారి పవిత్ర గ్రంథాలని వినే హక్కులేదు. వింటే వారి చెవుల్లో సీసం పొయ్యాల్సి ఉంటుంది.హిందువులు అంతా కలిసి దైవాన్ని ప్రార్థించలేరు. హిందువుల్లో అత్యధికులకి దైవాన్ని ప్రార్థించే అర్హత లేదు. ప్రార్థిస్తే వారి తల నరకాల్సి ఉంటుంది. (శూద్రుడైన శంబూకుడు | దైవాన్ని, స్మరిస్తూ, తపం చేసినందుకే రాముడు అతడి తల నరికేశాడు.) హిందువులు అంతా కలిసి దేవాలయాన్ని దర్శించలేరు. హిందువుల్లో అత్యధికులకి దేవాలయాన్ని దర్శించే యోగ్యత లేదు.దేవాలయంలో ప్రవేశిస్తే వారి ప్రాణం తీయాల్సి వస్తుంది.ఇదీ – హిందూ మతం!” అని ఫూలే స్పష్టం చేశారు.
ఫూలే ఇలా సవాల్ ఇలా చేశారు : “బ్రాహ్మణులు తమ మత గ్రంథాలన్నీ బయటకు తీయాలి. క్రైస్తవులంతా సమావేశమై బైబిలు ఎలా కలిసి చదువుతారో అలా, వాటిని అందరితోనూ కలిసి చదవాలి. అప్పుడు వాటిలో ఉన్న అసమానత, అన్యాయం, బహిర్గతమై వాటి బండారం బయట పడుతుంది…” (చూడండి: ‘మహాత్మా జోతిరావ్ ఫూలే’, ధనంజయ్ కీర్, 5.169)
ఫూలే… అసలు సమస్య మూలాల్లోకి వెళ్లగలిగారు.
ఆయనింకా ఇలా చెపుతున్నారు: “తమ మత గ్రంథంలో ఎలాంటి అన్యాయమూ, పక్షపాత ధోరణీ లేదు గనుకనే క్రైస్తవులు దానిని బాహాటంగా చదవగలుగుతున్నారు. క్రైస్తవులు, మహమ్మదీయులు మనకంటే తక్కువ వారనీ కింది వారనీ అనుకోకూడదు…” (అదే పుస్తకం: పే.169)
మనమంతా ఒకే జాతి వారం అని ఫూలే ఇలా పేర్కొన్నారు “మనది ఒకటే మూల కుటుంబమని పాపం వాళ్ళకి తెలియదు.శూద్ర జాతిలో కొంతమంది ఈనాడు తాము మాలీలమనీ, కుంబీలమనీ, కంసాలులమనీ, దర్జీలమనీ, కమ్మర్లమనీ, వడ్రంగులమనీ వాళ్ళ వాళ్ళ వృత్తుల ప్రాతిపదికగా గొప్పగా చెప్పుకుంటారు. మన పూర్వీకులున్నూ మహర్లు, మాంగులు అని పిలువబడే అంటరానివాళ్ళ పూర్వీకులన్నూ స్వయానా తోడబుట్టిన వాళ్ళనీ, రక్త బంధువులనీ, మన మన వంశ పరంపరల మూలాన్ని జాడతీస్తే మనది ఒకటే మూల కుటుంబమని పాపం వాళ్లకి తెలియదు.”
– అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రబోధకులు & న్యాయవాది




