శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో టాలీవుడ్ సినీ హీరో నారా రోహిత్ ప్రత్యేక పూజలు

ఆలయంలోనే ఆదివారం రాత్రి బస
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులోగల 11వ శతాబ్దపు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు, కుమారుడు టాలీవుడ్ హీరో, నారా రోహిత్ ఆదివారం రాత్రి ఆలయంలోనే నిద్రించారు. సోమవారం ఉదయం నాలుగు గంటలకు లేచి ఆలయ ఆవరణలో స్నానమాచరించి, బ్రహ్మ ముహూర్తంలో స్వామి వారికి అర్చకులు సాయిశివ, ప్రమోద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ఛైర్మన్ గోపాల్ రెడ్డి, హీరోను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. హీరో రోహిత్ మాట్లాడుతూ మరకత శివాలయంలో అభిషేకాలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని, చల్లని వాతావరణంలో ఆలయ పరిసరాలు బాగా ఉన్నాయన్నారు. మరల సమయం చూసుకుని కుటుంబ సభ్యులతో మరకత శివాలయానికి వస్తానని పేర్కొన్నారు.
