రాజమాత జిజియా బాయి మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలోని సింధ్‌ఖేడ్ అనే గ్రామంలో 1598 వ సంవత్సరం జనవరి 12 వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి యాదవ వంశానికి చెందినవాడు.జిజియా బాయి మరాఠాకు చెందిన కుర్మీ వర్గానికి చెందిన మాలోజీ కుమారుడు శాహాజీ భోస్లేను వివాహం చేసుకుంది. బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ తండ్రి పేరు మాలోజీ సక్పాల్.జిజియా బాయి భర్త శాహాజీ భోస్లే తండ్రి పేరు మాలోజీ భోస్లే.వీరు ఇద్దరి పేర్లు మాలోజీ కావడం వెనుక చారిత్రక కారణాలు గురించి ఇంకా పరిశోధన జరగాలి. శాహాజీ భోస్లే బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షాహి సైన్యంలో సర్దార్‌గా(సుల్తానేట్ లో సుబేదారుగా) పనిచేశాడు.శివాజీ పుట్టిన తరువాత, శాహాజీ భోస్లేను బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షాహి పూణేకు పంపాడు, దాని కారణంగా శివాజీని పెంచే బాధ్యత పూర్తిగా తల్లి జిజాబాయిపై పడింది.
బీజాపూర్ సుల్తానులు, ఉత్తర భారత మొగలుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో జిజియా బాయిను భద్రంగా పూనా దగ్గరలో గల శివనేది కోటలో ఉంచారు. ఈ శివనేది కోట పర్వత శ్రేణులు మధ్య ,కొండల మధ్య, పొలాల మధ్య ఉన్న గ్రామీణ ప్రాంతంలో శివాజీ పెరిగాడు.రాజమాత జిజియా బాయి శివాజీకు చిన్నప్పటి నుండి వీరోచిత గాథలు చెప్పి కొడుకును వీరునిగా తీర్చిదిద్దేది.
రాజమాత జిజియా బాయి గురించి చరిత్రలో పెద్దగా సమాచారం లేదు.ఒక కళాకారుడిని అతని కళాకృతి ద్వారా గుర్తించవచ్చు.ఆ విధంగా రాజమాత జిజియా బాయి గురించి తన కుమారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వ్యక్తిత్వంతో మాతా జిజియా బాయిను మనం గుర్తించాలి.
మను(కుల)వాద చరిత్రకారులు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తప్పుడు ప్రచారం చేశారు.మాతా జిజియా బాయి రామాయణం మరియు మహాభారతం నుండి కథలు చెప్పేవారని చరిత్ర కారులు వక్రీకరించి తమకు అనుకూలంగా వ్రాసుకున్నారు..నిజానికి మనం రామాయణం మరియు మహాభారతాలను అధ్యయనం చేస్తే, అందులో స్ఫూర్తినిచ్చేది ఏమీ లేదని మనం కనుగొంటాము.రాజమాత జిజియా బాయి శివాజీకి స్ఫూర్తిని ఇచ్చే విషయాలు,వీరోచిత గాథలు బోధించేవారు.
శివాజీ గురువులు కొండేవ్ మరియు స్వామి రాందాస్ లు అని వేటగాళ్ళ చరిత్ర లో వ్రాశారు.నిజానికి శివాజీ మొదటి గురువు మాతా జిజియా బాయి.శివాజీ పెరుగుతున్నప్పుడు, అతను కుర్మీ కులానికి చెందిన సంత్ తుకారాంజీ తన గురువుగా భావించాడు. ఆయన బోధనల సారాంశం ఇలా ఉంది : ‘మాంత్రికులు కాళీ కపటులు.దుక్ఖితులైన వ్యక్తి యొక్క బాధను తొలగించేవాడు సాధువు, జుట్టు పెంచి, కాషాయం ధరించేవాడు కాదు.గుహలలో కూర్చోవడం వల్ల ఎవరూ రక్షించబడరు.దేహంపై బూడిద పూసుకుంటే మోక్షం ఉండదు. తీర్థయాత్రలలో దేవుడు లేడు.’
శివాజీ పట్టాభిషేకం జరిగిన 4 సంవత్సరాల తర్వాత 1678 లో స్వామి రాందాస్ శివాజీ ఆస్థానానికి వచ్చి భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.శివాజీ మహారాజ్, “మేము ఈ రాష్ట్రాన్ని రైతుల కోసం స్థాపించాము. మీలాంటి బిచ్చగాళ్ల కోసం కాదు.” అని సమాధానం చెప్పారు.శివాజీ గో బ్రాహ్మణ రక్షకుడు అని వేటగాళ్ళ చరిత్రలో చెబుతున్నారు.శివాజీ మహారాజ్ గో-బ్రాహ్మణుల పోషకుడైతే, బ్రాహ్మణుడైన మోరోపంత్ పింగళే (శివాజీ చేసిన అష్టమండలానికి అధిపతి) నిండు ఆస్థానంలో శివాజీ పట్టాభిషేకాన్ని ఎందుకు వ్యతిరేకించాడు? శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ని కలవడానికి వెళ్ళినప్పుడు, బ్రాహ్మణుడైన కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అతనిపై ఎందుకు ప్రాణాపాయం కలిగించాడు? శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు అని చరిత్రలో చెబుతున్నారు. వాస్తవానికి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినట్లయితే, హిందూ రాజు జై సింగ్ ఔరంగజేబు తరపున శివాజీ మహారాజ్‌ను ఎందుకు జైలులో పెట్టాడు.హిందూమతం ద్వారా పదే పదే అవమానించబడిన శివాజీ మహారాజ్ తరువాత కులం గురించి మరింత ఉదారంగా ఉండే శాక్త మతాన్ని అంగీకరించాడు.శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినట్లయితే, అతను ఎందుకు మహాశక్తిగా మారాడు?
ఛత్రపతి శివాజీ ముస్లిం వ్యతిరేకి అంటూ చరిత్రలో ముస్లింలకు వ్యతిరేకంగా శివాజీను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి శివాజీ ముస్లిం వ్యతిరేకి అయినట్లయితే, అతని సైన్యంలో 35% ముస్లింలు ఉండేవారు కాదు. అతని దగ్గరి సైనికుడు కూడా ముస్లిం.భారతీయ చరిత్రలో శివాజీ మహారాజ్ బ్రాహ్మణీకరించబడ్డాడని మనం చూస్తాము.బ్రాహ్మణీకరణ అంటే ఏమిటి? ఏ మహానుభావుడిని అయినా బ్రాహ్మణ రాజ్యంలో కూర్చోబెట్టి, వ్యక్తిత్వాన్ని తగ్గించి, తన రంగును పూసుకుని, తన భాషలో మాట్లాడే వాడిని తన ప్రతినిధిగా చేయడం ఆ మహానుభావుని బ్రాహ్మణీకరణ చేయడం.తల్లి బిడ్డకు మొదటి గురువు.తల్లి లోపల ఏ సంస్కారం జరుగుతుందో, అదే సంస్కారం ప్రతి బిడ్డలో నింపబడుతుంది. రాజమాత జిజియా బాయి శివాజీ మహారాజ్ వ్యక్తిత్వాన్ని ఎలా సృష్టించారో, అదే విధంగా ప్రతి తల్లి తన బిడ్డ వ్యక్తిత్వాన్ని సృష్టించాలి. రాజమాత జిజియా బాయి వ్యక్తిత్వం నుండి మనం ఈ పాఠాన్ని తప్పక తీసుకోవాలి.నిజమైన చరిత్ర చదువుదాం.
శూద్ర,అతిశూద్రులకు ఆయుధ నిరాకరణ ఉన్న రోజుల్లో కత్తి చేతబట్టి బ్రాహ్మణ ధర్మమైన మనుస్మృతిని ఎదిరించి,తన కొడుకు ఛత్రపతి శివాజీని చక్రవర్తిని చేయడమే కాకుండా,సమస్త భారత దేశ మహిళలకు మనువాద ఆర్త బ్రాహ్మణుల ద్వారా వ్రాయబడ్డ ‘మనుస్మృతి’ గులాంగిరి నుండి విముక్తిని అందించిన రాజమాత జిజియాబాయి.
“ప్రతి దేశద్రోహినీ వేటాడు ,ప్రతి దేశభక్తుణ్ణి పూజించు ,స్త్రీలను గౌరవించు” అంటూ రాజమాత జిజియా బాయి తనకొడుకు శివాజీను మహారాష్ట్రలో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు బాల్యం నుంచే విలువలను,దేశభక్తిని నూరిపోసి పెంచింది. జిజియా బాయికు ఎనిమిది మంది కుమారులు,ఆరుగురు కుమార్తెలు. పెద్ద కొడుకు శివాజీ.జిజియా బాయి తండ్రి ప్రఖ్యాత మరాఠా సర్దార్ మరియు లఖుజీ జాదవరావు అనే గొప్ప వ్యక్తి, ఆమె తల్లి మాలాసా బాయి. ఆమె తండ్రి అహ్మద్‌నగర్‌కు చెందిన నిజాం షాహికి సేవలందించారు.శాహాజీ భోస్లే మిలోజీ షిలేదార్ కుమారుడు, తరువాత అతను ‘సర్దార్ మాలోజీ రావు భోస్లే’ గా ఎదిగారు.జిజియా బాయి – శాహాజీ భోస్లే జంట సంతోషంగా వివాహ జీవితాన్ని గడిపినప్పటికీ, కుటుంబ సభ్యులలో శత్రుత్వం ఏర్పడింది.ఇది శాహాజీకి మరియు అతని బావ జాదవ్‌కు మధ్య పెరుగుతున్న అనారోగ్య భావనకు దారితీసింది. అది జిజియా బాయిని విడదీసింది, తన భర్త మరియు ఆమె తండ్రి మధ్య తన విధేయతను ఎంచుకోవలసి వచ్చింది. ఆమె తండ్రి చివరికి ఢిల్లీ మొఘలులతో, నిజాం షాకి వ్యతిరేకంగా మరియు శాహాజీపై ప్రతీకారం తీర్చుకోవడానికి రాజ్యాన్ని విడిచిపెట్టాడు. జిజియా బాయి తన భర్తతో కలిసి శివనేది కోటలో ఉండి, భక్తితో అతని పక్షాన నిలబడ్డాడు. ఏదేమైనా, అతను మరియు ఆమె తండ్రి ఇద్దరూ ఇతర పాలకుల క్రింద పనిచేసినందుకు ఆమె నిరాశ చెందింది.అదే సమయంలో మరాఠాలు స్థాపించిన రాజ్యం క్రింద ఆమె స్వేచ్ఛ కోసం ఆరాటపడింది. మరాఠా వంశానికి స్వతంత్ర పాలకుడిగా తన కొడుకు శివాజీను చేయాలని ఆమె భావించారు.ఆమె సంకల్పం వలన శివాజీ మరాఠా సామ్రాజ్యం స్థాపకుడిగా ఎదిగారు.జిజియా బాయి ఆత్మగౌరవం మరియు ధర్మం యొక్క స్వరూపురాలైనన ప్రభావవంతమైన మరియు దృఢమైన మైన మహిళ. ఆమె ముందు చూపుకు ప్రసిద్ధి చెందిన జిజియాబాయి స్వయంగా సమర్థురాలైన యోధురాలు మరియు నిర్వాహకురాలు.ఆమె తన నాణ్యమైన లక్షణాలను పెరుగుతున్న శివాజీకి అందించింది మరియు తలెత్తే ఎంతటి కష్టాలను అయినా సరే అధిగమించడానికి శివాజీలో ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె మార్గదర్శకత్వంలోనూ, సంరక్షణలో, శివాజీ గొప్ప వీరునిగా ఎదిగారు. శివాజీ మహారాష్ట్ర స్వేచ్ఛ కోసం తపనతో పాటు మహిళలందరికీ, మత సహనం మరియు న్యాయం పట్ల గొప్ప గౌరవాన్ని కలిగి ఉండేలా చేశారు.మరాఠా సామ్రాజ్యం యొక్క గొప్ప పాలకులలో ఒకరిగా ఎదగడానికి తన కొడుకును పెంచుకోవటానికి తన జీవితాన్ని అంకితం చేసిన తన తల్లి ప్రేరణకు శివాజీ రుణపడి ఉంటాడు.
జిజియా బాయి రాజమాతగా తన భర్త జాగీర్ ను నిర్వహించడానికి పూనాకు వెళ్లి, శివాజీని తనతో తీసుకువెళ్ళింది. అయితే, 1666 లో, శివాజీ ఆగ్రాకు బయలుదేరాడు, రాష్ట్ర వ్యవహారాల నిర్వహణ కోసం జిజియా బాయిని విడిచిపెట్టాడు. అప్పటి నుండి, చరిత్రలో అసంఖ్యాక సంఘటనలు జిజియా బాయి జీవితంలో కొనసాగాయి. కొన్ని మంచి, కొన్ని విషాదకరమైన మరియు బాధాకరమైనవి, అయినప్పటికీ ఆమె నిశ్శబ్దంగా వాటిని భరించింది. భర్త మరణం ఆమెకు తీవ్ర దుక్ఖాన్ని తెచ్చి పెట్టింది.ఆమె పెద్ద కుమారుడు శంభాజీని అఫ్జల్ ఖాన్ చంపారు. వీరిలో శివాజీ తరువాత జిజియా బాయి ఆశీర్వాదంతో ప్రతీకారం తీర్చుకున్నాడు.ఏది ఏమయినప్పటికీ, శివజీ గొప్ప విజయాలు, అతను థొరంగాడ్ కోటను స్వాధీనం చేసుకోవడం, మొఘలులతో అతని అనేక అద్భుతమైన తప్పించుకోవడంతో పాటు, ఆమె నుండి ప్రేరణ పొందిన తనాజీ, బాజీ ప్రభు, సూర్య జీ వంటి హీరోల సాహసోపేతమైన విజయాలు ఆమెకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని తెచ్చాయి.పురాణ మరాఠాల నాయకురాలిగా 1674 లో బంగారు సింహాసనాన్ని అధిరోహించినప్పుడు, ఆమె కుమారుడు శివాజీ పట్టాభిషేకానికి సాక్ష్యమిచ్చినప్పుడు జిజియబాయి కల నెరవేరింది. ‘రాజమాత’ అని పిలవబడే జిజియాబాయి శివాజీ పట్టాభిషేకం తరువాత కొద్ది రోజుల తరువాత, పచ్చాడ్ గ్రామంలో, ఫోర్ట్ రాయగడ పాదాల వద్ద మరణించింది.ఆమె మరణం మొత్తం రాజ్యానికి తీవ్ర దుక్ఖాన్ని తెచ్చిపెట్టింది.ఈనాడు రాయగడ ప్రాంతం శివాజీ వలనే పవిత్రంగా పరిగణించబడుతుంది. శివాజీ బాలుడితో ఉన్న తల్లి జిజియా బాయి యొక్క అనేక విగ్రహాలు, భారతీయ చరిత్రలోని రెండు గొప్ప స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య మాతృ బంధాన్ని గుర్తుచేస్తాయి.
రాజమాత జిజియా బాయి తన జీవిత భాగస్వామి మరణం తరువాత పూణే (అప్పటి పూనా) కు వెళ్లారు. శివాజీ 1666 లో ఆగ్రాకు బయలుదేరాడు, తన తల్లి రాజమాత జిజీయా బాయిను వదిలి రాష్ట్ర వ్యవహారాల నిర్వహణకు బయలు దేరాడు.రాజమాత జిజియా బాయి బలం ఛత్రపతి శివాజీ మహారాజే. శివాజీ మహారాజ్ తన సాధించిన విజయాలన్నింటికీ రాజమాత జిజియా బాయి యొక్క ఘనత వల్లనే అని చెప్పుకున్నారు.
జిజియా బాయి కు చిన్న వయస్సులోనే పరిణయం జరిగింది. జిజియా బాయి పేదల పట్ల సేవ చేయాలనే ఆలోచన కలిగి ఉండేవారు.తనను తాను రక్షించుకుంటూనే మరోపక్క మనువాద ఆక్రమణ దారుల నుండి తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి కృషి చేసిన యోధురాలు. జిజియా బాయి సద్గుణ నాయకురాలు. దాడి చేసే వారిపై దాడి చేయాలనీ ఆమె నమ్మేవారు.అంతర్గత సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడం చేసేవారు.ఒకసారి, ఒక ఏనుగును వదలగా భోంస్లే మరియు జాదవ్ లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.జిజియా బాయి భోస్లే మరియు జాదవ్ ల మధ్య తలెత్తిన ఘర్షణలు శాంతింప జేయాలని మరియు సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరుకునేవారు.తద్వారా భోస్లే మరియు జాదవ్‌లు ఐక్యమై ఆక్రమణదారులతో పోరాడటానికి సన్నధ్ధం అవుతారు.జిజియా బాయి ఒకసారి తన తండ్రితో “మరాఠాలు కేవలం అహం మరియు దురాశ కోసమే ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. వారి పరాక్రమ కత్తులు ఏకం అయితే, విదేశీ ఆక్రమణదారులపై యుద్ధం చేసి వాళ్ళను ఏ సమయంలోనైనా తరిమి వేయవచ్చు. మీ జీవనోపాధి కోసం ఆక్రమణ దారుల క్రింద పనిచేయడం అవమానకరం, మీరు దానిని వదులు కోవాలి.” అన్నారు.ఆమె మాటలు భోస్లే, జాదవ్‌ల చారిత్రక ఐక్యతకు దారితీశాయి.
‘స్వరాజ్’ పట్ల ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్ల ఎడతెగని అభిమానం వెనుక జిజియా బాయి పెంపకం ఒక ప్రధాన కారణం.ఆమె అత్యున్నత స్థాయి జాతీయవాది మరియు నిర్ణయం తీసుకోవడంలో ఆమె చురుకుగా ఉండేవారు.మరాఠాలను కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆమె ఒప్పించింది.ఆమె మరాఠా చరిత్రలో ఒక వీరుని కన్న తల్లిగా చిరస్థాయిగా నిలుస్తున్నారు, ఆమె అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంటుంది.శివాజీ పట్టాభిషేకానికి కొన్ని రోజుల ముందు, 1674 జూన్ 17 న ఆమె నిర్యాణం చెందారు.
రాజమాత జిజియాబాయి గురించి, ఛత్రపతి శివాజీ గురించి చరిత్రలో మతోన్మాదులు కాషాయం రంగు పులిమి హిందూరాజ్యం కోసం పనిచేసినట్లు వక్రీకరణ చేసి అసలు చరిత్రను చెప్పకుండా తప్పుడు వ్రాతలతో సమాజాన్ని ద్వేష భావనవైపు నడిపిస్తోన్నారు.వాస్తవానికి మాతా జిజియాబాయి ఏనాడూ ఏ మతం మీద ద్వేషం కానీ ఒక మతం ఆధారంగా రాజ్యాన్ని నిర్మించమని కానీ తన తనయుడు శివాజీ కు బోధించ లేదు.జిజియాబాయి కరుణ గల హృదయం గల స్త్రీ. భావి మరాఠా సామ్రాజ్యాన్ని మానవత్వం తో విలువలతో సమతా రాజ్యం వైపు నడిపించాలని కలలు కన్నది.ఆమె ఏనాడూ హిందూ రాజ్యం స్థాపించడానికి తన తనయుణ్ణి పెంచలేదు.ముస్లిములపై ద్వేషాన్ని తన తనయుడికి నూరిపోయలేదు.కొందరు పనిగట్టుకుని అసలు చరిత్రను వాళ్ళ ఆధిపత్యం మెజారిటీ ప్రజల మీద రుద్ధడానికి హిందూ రాజ్యం స్థాపనకు జిజియాబాయి, శివాజీ లు కృషి చేశారని వక్రీకరణ చేసి అదే పనిగా సోషల్ మీడియా లో పోస్టులు పెడుతుంటే అసలు చరిత్ర తెలియకుండా చాలా మంది అదే నిజమని నమ్మి ఆ ద్వేష పూరిత పోస్టులు కాపీ చేసి ,షేర్ చేయడం శోచనీయం.
శివాజీను చక్రవర్తి చేయడానికి తల్లిగా జిజియాబాయి రాజ్యం అంతా పర్యటించి రాజ్యంలో ఆనాటి వర్ణ వ్యవస్థ వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించారు.ప్రజల కష్టాలను తొలగించడానికి కృషి చేశారు. శివాజీ ను మంచి ఆదర్శ చక్రవర్తిగా తీర్చిదిద్దిన గొప్ప ఆదర్శ మాతృమూర్తి జిజియాబాయి.ఆనాటి బ్రాహ్మణులు ఒక శూద్రుడు రాజ్యపాలన చేయడం సహించలేక పోయారు.మనుధర్మశాస్త్రం ప్రకారం శూద్రులు రాజ్యపాలన చేయరాదు.శూద్రులు, మహిళలు చదువుకోరాదు.కేవలం సేవకులు గా ఉండాలి అని హిందూధర్మం అయిన మనుధర్మశాస్త్రం చెబుతోంది. అలాంటిది శూద్ర కులానికి చెందిన అందులోనూ ఒక మహిళ రాజమాత గా తన తనయుణ్ణి రాజు చేయాలని చూడటం ఆ రోజుల్లో గొప్ప సాహసమే.అందుకే ఆనాటి పురోహితులు శివాజీ కు పట్టాభిషేకం చేయడానికి ముందుకు రాకపోవడంతో పక్క రాజ్యం నుంచి గంగంభట్టు అనే బ్రాహ్మణుడిని తీసుకుని వస్తారు.బ్రాహ్మణ ధర్మం ఎక్కడా శూద్రులను గౌరవించదు.అందుకే నాడు శివాజీ పట్టాభిషేకం సమయంలో ఎడమ కాలి బొటన వ్రేలితో శివాజీ నుదుటిన తిలకం పెట్టి నాటి బ్రాహ్మణ మనువాదులు శూద్ర శివాజీను అవమానం చేసారు. ఇది చాలా దుర్మార్గం,అమానుషం, అన్యాయం.ఇలాంటి హిందూ అసమానతలపై శివాజీ, అతని తరువాత వచ్చిన వారసులు పోరాటం చేశారు.