రైతులను మోసం చేస్తున్న ఆంధ్ర నాటు పొగాకు వ్యాపారస్తులు
రైతులను మోసం చేస్తున్న ఆంధ్ర నాటు పొగాకు వ్యాపారస్తులు
పట్టించుకోని వ్యవసాయ అధికారులు

నేటికీ పొగాకుతో లక్షలు సంపాదిస్తున్న స్థానిక బడా బాబులు
పంట నాలుగు నెలలు కానీ వడ్డీ మాత్రం 12 నెలలు
జ్ఞాన తెలంగాణ, భద్రాద్రి:
అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి, జగన్నాధపురం ,అన్నపురెడ్డిపల్లి, మండలాల్లో ఆంధ్ర వ్యాపారస్తులు మొదట పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చాక లారీలతో అర్ధరాత్రి పూట కాటా పెట్టేసి తీసుకువెళ్లిపోతారు. తీసుకువెళ్లిన తర్వాత లెక్కలకు రెండు నెలల తర్వాత రమ్మంటారు. ఈ రెండు నెలల్లో వారు తీసుకున్న పెట్టుబడికి కూడా వడ్డీ వేస్తారు.
పంట ఎలా ఉన్నా,ఒక రైతుకు ఒకలాగా ఇంకో రైతుకు మరోలాగా పొగాకు రేటును నిర్ణయిస్తారు. రేటు మొత్తం షావుకారి కంటే గుమస్తా చేతుల్లోనే ఉంటుంది. గుమస్తా చెప్పినట్లే ఆ షావుకారు రేటు వేస్తారని రైతులు అంటున్నారు. ఒకసారి పొగాకు వేసిన రైతు మరోసారి వేయరు. ఎందుకంటే కష్టపడి నాలుగు నెలలు నిద్ర లేకుండా పొగాకు పండిస్తే, వారి చేతిలోకి పంట వెళ్ళిన తర్వాత పంటకు గిట్టుబాటు ధర వేయకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారని పంట రేటును పొలంలో కానీ స్థానిక గ్రామంలో గాని వెయ్యకుండా, పంటను ఏలూరు కి పంపించిన తర్వాత కొంతమంది గుమస్తాలను పిలిపించుకొని ఎవరెవరికి ఎంత రేటు వేయాలో ముందే చర్చించుకుని, వారు మరలా వచ్చి లెక్కలకు వెళ్దాం అని చెప్పి. ఏలూరు తీసుకుని వెళ్లి లెక్కలు చూసుకుని వస్తారు. అయితే కొంతమంది రైతులు ఒకసారి నాటు పొగాకు వేస్తే లెక్కలు చూసిన తర్వాత మేము మోసపోయాము అని తెలుసుకొని రెండోసారి వెయ్యము, కానీ ఇక్కడున్న గుమస్తాలు మాయమాటలు చెప్పి మరొకరిన పట్టుకొని వారితో పొగతోట వేయించి.
వారిని అదేవిధంగా మోసం చేస్తున్నారని వాపోతున్నారు. ఇలాంటి విషయాలను సంబంధిత అధికారులు గుర్తించి ఆంధ్ర వ్యాపారులను కట్టడి చేయాలని మధ్యతరగతి రైతులు వాపోతున్నారు.