మహిళా చట్టాలపై అవగహన కల్పించాలి:

మహిళా చట్టాలపై అవగహన కల్పించాలి:
ఙ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 7:
నారాయణపేట పట్టణంలోని వైదిక ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ఫ్రీ కోచింగ్ సెంటర్లో మహిళల చట్టాలపై అవగహన కల్పించినట్లు ఎఎస్ఐ శ్రీదేవి తెలిపారు.
ఇప్పటికే దేశంలోని అనేక చోట్ల మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోవటం , ఆకతాయిల పైనా ఎదురు ఎల్లి నిలుచుకొని తమని తాము కాపడుకొనేల అనేక వివిధ చోట్ల శిక్షణ ఇవ్వాలని కోరారు.త్వరలోనే నూతనంగా జూనియర్ కళాశాల ఆవరణలో పలు విద్యార్థుల తో మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే మహిళపై ప్రత్యేక చట్టాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆకతాయిల నుండి వేధింపులకు గురైతే షి టీమ్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అలాంటి వివాహాలతో అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. ఫోక్సీ, నిర్బయ వంటి చట్టాలపై అవగాహన కల్పించారు.