చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుర్మరణం చెందారు.ఇటీవల బంధువుల వివాహం సందర్భంగా సొంతూరు అయిన తాండూరుకు వచ్చిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), మరియు తనూష (ఎంబీఏ) ఈరోజు ఉదయం తాండూరు నుండి హైదరాబాద్‌కి తిరిగి వెళ్తుండగా,మీర్జాగూడ వద్ద బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామమంతా షాక్‌లో మునిగిపోయింది.తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మునిగిన కళ్లతో ఆ బాలికలను స్మరిస్తున్నారు.

You may also like...

Translate »