ఖమ్మం జిల్లాలో రెండు వందల కోట్ల రూపాయల బియ్యం కుంభకోణం లో బాధ్యులను అరెస్టు చేయాలి

కోట్ల రూపాయల బియ్యం కుంభకోణం లో బాధ్యులను అరెస్టు చేయాలి


  • ఎస్ ఏ ఆర్ రైస్ మిల్లు యాజమాన్యం ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
  • తేమ తాలు పేరుతో కోత పెట్టిన డబ్బు రైతులకు తిరిగి ఇవ్వాలి
  • రైతులు సాగు భూములకు వెళ్ళే రహదారులు ఆక్రమించి బెదిరింపులు చేస్తున్నారు
  • తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా, రహదారులు పరిశీలన

జ్ఞాన తెలంగాణ,కొణిజర్ల : ఖమ్మం జిల్లా లో ప 200 కోట్ల రూపాయలు విలువచేసే బియ్యం కుంభకోణం లో బాధ్యులను అరెస్టు చేయాలి అని, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు నుంచి లాలా పురం సమీపంలో ఎస్ ఏ ఆర్ రైస్ మిల్లు కు ధాన్యం పంపగా క్వింటాలకు ఐదు నుంచి పది కేజీలు తేమ తాలు పేరుతో కోత పెట్టి కోట్ల రూపాయలు రైతుల సొమ్ము మిల్లు యాజమాన్యం కా చేసిందని రైతులను అటు ప్రభుత్వాన్ని మోసం చేసిన రైస్ మిల్ యాజమాన్యాన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని అందుకు సహకరించిన జిల్లా అధికారులను బాధ్యులు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మిల్లు ఎదుట నిరసన వ్యక్తం చేశారు,

ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ మాట్లాడుతూ ఎస్ ఏ ఆర్ యాజమాన్యం ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి వచ్చిన సొమ్ముతో వందలాది ఎకరాలు భూములు కొనుగోలు చేశారు అని యాజమాన్యం ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు,కొనిజర్ల మండలంలో పలు గ్రామాల్లో రైతుల పంట పొలాలకు వెళ్లే రహదారులను కూడా ఆక్రమించి ప్రహరీ గోడలు, ఫెన్సింగ్ నిర్మాణం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇట్టి దౌర్జన్యాలపై ప్రశ్నించిన రైతులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు, బియ్యం కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జిల్లా అధికారులు 200 కోట్ల అవినీతి జరిగినట్లుగా నిర్ధారణ చేసి ఎస్ ఏ ఆర్ రైస్ మిల్లులో 81 కోట్ల రూపాయల విలువైన బియ్యం ప్రభుత్వానికి సరఫరా చేయకుండా మాయమైనట్లు గుర్తించి కూడా నెలల నుంచి యాజమాన్యం ను అరెస్టు చేయకుండా కాలయాపన చేయడం ఎందుకు అని అన్నారు, రాజకీయ పలుకుబడి ఉపయోగించి వందల కోట్ల అవినీతికి పాల్పడుతుంటే జిల్లా మంత్రులు మౌనం వహించటం తగదన్నారు.రైతులు నుంచి ప్రభుత్వం ధ్యానం కొనుగోలు చేసి రైస్ మిల్లు కు పంపిన తర్వాత తేమ తాలు పేరుతో క్వింటాలకు ఐదు నుంచి పది కేజీలు కోత పెట్టారు అని ఇట్టి విషయంపై 2022లో నాటి సివిల్ సప్లై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ వైరా వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో తెలంగాణ రైతు సంఘం ఫిర్యాదు చేయగా ఎస్ ఏ ఆర్ రైస్ మిల్లును సీజ్ చేయాలని నాటి కలెక్టర్కు సిఫార్సు చేశారని రాజకీయ పలుకుబడిన ఉపయోగించి ఆనాటి చర్య నుంచి తప్పించుకున్నారని అన్నారు.మాజీ మంత్రి పువ్వాడ ప్రస్తుత మంత్రి తుమ్మల తమకు బంధువు అంటూ ఈ ప్రాంత ప్రజలను భయాందోళన గురి చేస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ ప్రస్తుత మంత్రి తుమ్మల ఎస్ ఏ ఆర్ యాజమాన్యంతో ఉన్న బంధుత్వాన్ని సంబంధాలను బహిరంగ పరచాలని కోరారు.

రాజకీయం ఫ్లస్ వ్యాపారం కలిసి చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రైతులు తిరుగుబాటును ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో దశాబ్దాలుగా రైతుల పొలాలకు ఏర్పాటు చేసుకున్న రహదారులను ఆక్రమించడం పై రెవెన్యూ అధికారులు స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చెరుకుమల్లి కుటుంబరావు దొడ్డబనేని కృష్ణార్జున్ రావు , సంక్రాంతి పురుషోత్తం, బోడేపూడి వీరభద్రం, సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు,జట్ల ఆనందరావు,కట్టా రాంబాబు, చింతపల్లి ప్రసాద్, ఖాసిం బేగ్, పైడిపల్లి సాంబశివరావు, పాసంగులపాటి రవి, చింత నిప్పు ప్రసాద్,పారుపల్లి కృష్ణారావు, ఎస్ కె అఫ్జల్, కావూరి, సత్యనారాయణ , దుగ్గిని అజయ్, రామయ్య,ఎస్ కె నాగుల్ మీరా,బాబు నాగేశ్వరరావు, కొంగర సుధాకర్, యనమద్ది రామకృష్ణ వడ్లమూడి మధు, మాడపాటి రామారావు, సంక్రాంతి సతీష్, ఇమ్మడి సుధీర్ అమరనేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »