రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి..


ప్రజల కోసం పోరాడుతున్న నాకు ఒక అవకాశం కల్పించండి..

ఎండి.జహంగీర్
సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి
జ్ఞాన తెలంగాణ వలిగొండ మీ 11

నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న తనను రాజకీయంగా చూడకుండా ప్రజల కోసం పోరాడే అభ్యర్థిగా ఓటేసి గెలిపించాలని సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈరోజు మండల పరిధిలోని వర్కట్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజా ఉద్యమాల పట్ల అనేక పోరాటాలు నడిపిన నాకు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తూ ఒక అవకాశం కల్పించి ఎంపీగా గెలిపించాలని రాజకీయంగా చూడకుండా ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని కార్పొరేట్లకు పెట్టుబడుదారులకు డబ్బున్న బడా నాయకులకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని ప్రజల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థిగా ముందుకు వచ్చిన తన పట్ల మంచి నిర్ణయం తీసుకొని ఓటు వేసి గెలిపించాలని కోరారు భువనగిరి పార్లమెంటుకు మూడుసార్లు ఇప్పటికే ఎన్నికలు జరిగాయని మూడుసార్లు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఏనాడు గ్రామాలను ప్రజలను పట్టించుకోలేదని అటువంటి వారందరికీ తగిన బుద్ధి ఈ ఎన్నికల్లో చెప్పాలని కోరారు తనను ఎంపీ గా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు భువనగిరి కేంద్రంగా అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్,కలుకూరి రామచందర్,సిపిఎం శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, భీమనబోయిన జంగయ్య ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు బుచ్చిరెడ్డి, చేగురి నరసింహ,ఆకుల మారయ్య,మాడుగుల వెంకటేశం,రొండి మల్లేశం,నాగేల్లి లక్ష్మయ్య,రొండి రాములు,చేగురి రాములు,మెట్టు లక్షమమ్మ,మాడుగుల కృష్ణవేణి,సిర్పంగి స్వప్న,వేముల జ్యోతి బస్,తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »