పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది…

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది…
- కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జ్ఞాన తెలంగాణ టేకుమట్ల.
టేకుమట్ల మండలంలోని మండల విద్యా వనరుల కేంద్రం నందు గురువారం రోజున కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది . మండలం లో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116/- విలువ కలిగిన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత పాలకుల కంటే భిన్నంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పేద కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఈ చెక్కుల పంపిణీలో తాసిల్దార్ , రెవెన్యూ అధికారులు ,జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ , తోట గట్టయ్య, కత్తి సంపత్, మండల నాయకులు, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.