గిరిజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి….

గిరిజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి….
ఖమ్మంలో గిరిజనులకు ఐటిడిఏ తక్షణమే ఏర్పాటు చేయాలి….
ఈనెల 20, 21న వైరాలో జిల్లాస్థాయి గిరిజన రాజకీయ శిక్షణ తరగతులు….
జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం
ఙ్ఞాన తెలంగాణ జూన్10, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని జిల్లాలో గిరిజన అభివృద్ధికి ఐటిడిఎ ను ఖమ్మంలో వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం విజ్ఞప్తి చేశారు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద కార్మిక భవన్ లో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా సహా కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ నాయక్ అధ్యక్షతన జరిగినది.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ..ఇండ్లు లేని పేదలకు వెంటనే ఇళ్ల నిర్మాణ పథకం మంజూరు చేసి నిర్మించాలని, గిరిజన తండాలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయులకు పదోన్నతి అవకాశాలు కల్పించాలని, పర్మినెంట్ టీచర్ పోస్టులు నియమించాలని డిమాండ్ చేశారు, పోడు సాగు చేస్తున్న రైతుల పట్ల ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు ఒత్తిడి చేయకుండా అటవి హక్కుల చట్టం ప్రకారం అందరికీ హక్కు పత్రాలు పంపిణీ చేయాలని, పోడు రైతులపై ఉన్న కేసులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో అన్ని విద్యాసంస్థల్లో సర్వేలు చేసి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా కమిటీ సమావేశం తీర్మానం చేసిందని ఆయన తెలిపారు. గిరిజన సంఘం కార్యకర్తలకు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈనెల 20, 21న వైరా పట్టణంలో నిర్వహిస్తున్నట్లు, సభ్యులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు.
సమావేశంలో జిల్లా నాయకులు భూక్యా కృష్ణా నాయక్, గుగులోత్ కుమార్ నాయక్, భూక్యా కృష్ణ నాయక్, బాధావత్ శ్రీనివాస్ నాయక్, భూక్యా నాగేశ్వరరావు, డుంగురోత్ శంకర్ నాయక్, లాకవత్ బాలు నాయక్, బానోతు హరిచంద్, బానోతు నాగేశ్వరరావు, భూక్యా సరోజినీ ,మాలోతు లచ్చు ,గుగులోతు బాలు నాయక్ లాకావత్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
