రెండవ రోజు కొనసాగిన బడిబాట.

రెండవ రోజు కొనసాగిన బడిబాట.

జ్ఞాన తెలంగాణ – బోధన్
బడిబాట కార్యక్రమం శుక్రవారం రెండవ రోజు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని రాకాసిపేట హాబిటేషన్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాకాసిపేట్(జేసీ) ఉపాధ్యాయులు కాలనీలలో తిరుగుతూ విద్యార్థుల తల్లితండ్రులను కలిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న సౌకర్యాలను వివరించారు. అలాగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను వివరించారు. శుక్రవారం బడిబాటలో భాగంగా 6 వ తరగతిలో 10 మంది , 9వ తరగతిలో ఒకరు, పదవ తరగతిలో ఒకరిని నమోదు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుమిత్ కుమార్, నగేష్ బాబు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »