ప్రైవేట్ విద్యాసంస్థలలో పాఠ్యపుస్తకాలు స్టేషనరీ అమ్మకాలను ఆపాలి

తేదీ:08/06/2024
కాగజ్ నగర్

ప్రైవేట్ విద్యాసంస్థలలో పాఠ్యపుస్తకాలు స్టేషనరీ అమ్మకాలను ఆపాలి,దామెర కిరణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కుమురం భీం జిల్లా కమిటీ సమావేశం ఈరోజు కాగజ్ నగర్ లోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జరిగింది..
ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ లేకుండా పోయిందని, విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు…
ప్రతి సంవత్సరం ఫీజులను పరిమితికి మించి పెంచి వసూలు చేస్తున్నారని అన్నారు.
వెంటనే ప్రభుత్వం స్పందించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు…
పాఠ్యపుస్తకాలు, దుస్తులు, స్టేషనరీ ప్రైవేటు విద్యాసంస్థలలో అమ్మకూడదని ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయని అన్నారు…
ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు…
విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులందరికీ సరిపడా పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందే విధంగా చూడాలని కోరారు…

నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ కుమురం భీం జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా వసాకె సాయికుమార్, కార్యదర్శిగా చాపిలె సాయిక్రిష్ణలు ఎన్నికయ్యారు

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మిడె భీమేష్, సతీష్, జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, నితీష్ జిల్లా కమిటీ సభ్యులు రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »