కారుణ్య మృతికి మారుతి కళాశాల యాజమాన్యమే కారణం

–బాధ్యులను కఠినంగా శిక్షించాలి

–కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి

ఆదివాసీ సంక్షేమ పరిషత్​ మహిళా రాష్ట్ర అధ్యక్షు రాలు కుంజా రమాదేవి డిమాండ్
జ్ఞాన తెలంగాణ, భద్రాచలం:

స్థానిక భద్రాచలం కూనవరం రోడ్డు మారుతి నర్సింగ్ కళాశాలలో విద్యార్థిని అనుమానస్పద మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని, తక్షణమే కళాశాల గుర్తింపు రద్దు చేసి కళాశాల బాధ్యులైన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కుంజా రమాదేవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మారుతి కళాశాల హాస్టల్ నందు మృతురాలి కుటుంబీకులు చేస్తున్న ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ పారా మెడికల్ మారుతి నర్సింగ్ కాలేజ్ హాస్టల్ ఊరు చివరన ఉండటం వల్ల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని భద్రత లేకుండా విద్యార్థులు హాస్టల్ లో ఉంటున్నారనీ కనీసం వసతి గృహం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని ఆమె ఆవేదన చెందారు. విద్యార్థుల దగ్గర లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటున్న పారా మెడికల్ యాజమాన్యం మహిళలకు రక్షణ లేని చదువులు అందిస్తున్నారని ఆరోపించారు. కారుణ్య మరణం చాలా బాధాకరమని మరణానికి యాజమాన్యం బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు. ఆమె మరణాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.కళాశాల యాజమాన్యం తప్పు లేకపోతే సిసి ఫూటేజీలను ఎందుకు డిలీట్ చేసారో తెలపాలని కోరారు. విద్యార్థిని యాజమాన్యమే విచక్షణా రహితంగా కొట్టారని, తీవ్రమైన గాయాలతో చనిపోయిందనీ, బాత్రూమ్ లో జారిపడి చనిపోయిందనడం శోచనీయం అన్నారు. లోకల్ డాక్టర్ సంఘాలు. డాక్టర్ లను, పోలీసుల విచారణ బృందాలను మేనేజ్ చేస్తుందనీ దీన్ని తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామని ఆమె తెలిపారు. యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని నిష్పక్షపాతంగా విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే బాధ్యులను గుర్తించాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని అన్నారు జిల్లా కలెక్టర్, డైరెక్టరేట్ మెడికల్ ఎడ్యుకేషన్, నర్సింగ్ కౌన్సిల్ ఐటీడీఏ పీవో స్పందించి తగు చర్యలు తీసుకోవాలని. నిర్లక్ష్యంగా ఏ రక్షణ లేకుండా దళిత విద్యార్థిని కారుణ్య మరణానికి కారణమైన మారుతి పారామెడికల్ జమాన్యంపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మహాజన సమితి రాష్ట్ర ఆదివాసీ మహిళ ఉపాధ్యక్షురాలు కంగాల రమణకుమారి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »