ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ను గెలిపించుకోవాలి

తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్

జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న పట్ట బద్రుల ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ అన్నారు.శుక్రవారం ఖైరతాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాం చందర్ మాట్లాడుతూ. త్వరలో జరగనున్న వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మద్దతు తెలుపుతోందని ఆయన అన్నారు.ఈనెల 27వ తారీకు నాడు జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆయన కోరారు.తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి చైతన్యపరిచే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన విద్యాధికులు అందరూ కూడా తీన్మార్ మల్లన్నకే ఓటు వేయాలని అన్నారు. విద్యాధికుడు, ప్రశ్నించే గొంతుక అయినటువంటి తీన్మార్ మల్లన్నను గెలిపించుకుంటే అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలను కౌన్సిల్లో ప్రశ్నిస్తారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని అన్నారు.రాబోవు కాలంలో కూడా మరిన్ని ఉద్యోగ నియామకాలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. కావున వరంగల్- ఖమ్మం- నల్గొండ పరిధిలోని గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయన విజయానికి కృషి చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ముఖ్య సలహాదారు రెడ్డి మల్ల యాదగిరి, వైస్ చైర్మన్లు టి అనీల్ రాజ్ కుమార్ , శ్యామ్ కుమార్, దాసరి భాస్కర్, ఆర్. మల్లేష్, కో కన్వీనర్లు బిట్ల శ్రీను, కాశీనాథ్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »