భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

జ్ఞాన తెలంగాణ స్టేషన్ ఘనపూర్:
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
స్టేషన్ ఘనాపూర్: భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని బి ఎన్ ఆర్ కే ఎస్ వ్యవస్థాపకులు శ్రమశక్తి అవార్డు గ్రహీత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కామన్ల ఐలన్న అన్నారు సోమవారం రాష్ట్ర అధ్యక్షుని పిలుపుమేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నుండి బయలుదేరిన భవన నిర్మాణ రంగాల కార్మికులు గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం బి ఎన్ ఆర్ కే ఎస్ రాష్ట్ర కోశాధికారి తాటికొండ మధు మాట్లాడుతూ ఏవైతే కార్మికుల డిమాండ్స్ వెల్ఫేర్ బోర్డులో బోగస్కార్డులను తీసివేయాలని అదేవిధంగా వెల్ఫేర్ బోర్డులో భవన నిర్మాణ కార్మికుని చైర్మన్ చేయాలని కోరుతు ఇలా 17 డిమాండ్లను వినతి పత్రంలో పొందుపరిచి కలెక్టర్ కు అందించానున్నమని తెలిపారు ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఉపాధ్యక్షులు నాయిని రామస్వామి, గోనెల అనిల్, ప్రచార కార్యదర్శి చింత శ్రీనివాస్, గ్రామ ఉపాధ్యక్షులు రాజు, వీరయ్య ,కార్యదర్శి మునిగల రాజు, తదితరులు పాల్గొన్నారు.