మినీ ఫంక్షన్ హల్ ప్రజలకు అందుబాటులోకి తేవాలి

నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి..

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

జ్ఞాన తెలంగాణ
రాజేంద్రనగర్ ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ నూతన భవనం మరియు 14వ వార్డు లో జరుగుతున్న మినీ ఫంక్షన్ హాల్ పనులను రాజేంద్ర నగర్ శాసన సభ సభ్యులుప్రకాష్ గౌడ్ అధికారులతో కల్సి పర్యటించారు.శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, కమిషనర్ సుమన్ రావు లతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపల్ నూతన భవన పనులు చివరి దశలో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తిచేయాలని సూచించారు. 14వ వార్డు ఇంద్రారెడ్డి కాలనీలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న మినీ ఫంక్షన్ హాల్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిర్మాణం పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొనమల శ్రీను , కో ఆప్షన్ నెంబర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...

Translate »