అంగన్ వాడి టీచర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలి….

కాంగ్రెస్ పార్టీ తాలూకా కో ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ…
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిఐటియు అధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యోగుల నిరవధిక ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తాలూకా కో ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ మద్దతు తెలిపారు.. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ అంగనవాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని,కనీస వేతనం 26000/- రూపాయలు ఇవ్వాలని,గ్రాట్యూడీ రిటైర్డ్ బెన్పిస్ట్,పెన్షన్ ఇఎస్ఐ,ఉద్యోగ భద్రతా కల్పించాలని ఇతర న్యాయ పరమైన సమస్యలను పరిష్కరించాలని పోరాడుతున్న మహిళల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి వెంటనే అంగన్‌వాడీ ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని సరితమ్మ డిమాండ్ చేశారు…కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, అల్వాల రాజశేఖరరెడ్డి, ఇమ్మానేయిల్, పెద్దపల్లి శివ,రఫీ, మధు,సిఐటియు నాయకులు వెంకటస్వామి, వి.వి.నరసింహ, ఏమ్మేలమ్మ,అరుణజ్యోతి,సీతక్క,సలోని,ఫరిధ,సుమిత్ర, అదిలక్ష్మీ తదితరులు ఉన్నారు..