ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
టీడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి -సైదులు
– ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి -నేషనల్ కమిటీ మెంబర్
– బి. దేవేందర్


జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, ప్రతినిధి,జులై 09 :
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టి డబ్ల్యూ జె ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం . సైదులు అన్నారు. గురువారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టి డబ్ల్యు జే ఎఫ్ ) రాజేంద్రనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం గండిపేట మండల పరిధిలోని ఖానాపూర్ లో నియోజకవర్గ అధ్యక్షులు ఏ. గోపాల్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో నేషనల్ కమిటీ సభ్యులు బి. దేవేందర్ పాల్గొన్నారు. యూనియన్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఇ.బుచ్చన్న కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని తెలిపారు. గత ఎన్నికల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆ పార్టీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు.. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతున్న మీడియా రంగాన్ని పట్టించుకోకపోవడం వల్ల అందులో పని చేస్తున్న జర్నలిస్టుల జీవితాలు ఆగమవుతున్నాయని తెలిపారు. వార్తలు రాసే క్రమంలో జర్నలిస్టులపై అనేకమైన దాడులు జరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఇండ్ల స్థలాలు, కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం, పెన్షన్ హెల్త్ కార్డులు, పిల్లలకు ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో యూనియన్లకతీతంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. నేషనల్ కమిటీ మెంబర్ దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు పెంచాలని సూచించారు. తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అధ్యక్ష కార్యదర్శులు ఏ. గోపాల్ ఇ. బుచ్చన్న మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గం జర్నలిస్టుల సమస్యల కోసం ప్రతిపాదించిన పలు తీర్మానాలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కే. సుదర్శన్ గౌడ్, ఎం. శ్రీనివాస్, సలహాదారు కే. యాదయ్య, ఉపాధ్యక్షులు ,ఇ. ప్రభాకర్ , పీ.మాధవాచారి, సహాయ కార్యదర్శులు పి. యాదగిరి, ఎం. శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి ఆర్. జ్ఞానేశ్వర్, ఎం . విజయ్, ఎం. కిట్టు ప్రసాద్, సుధీర్ కుమార్, అనిల్ కుమార్, జీ. శ్రీనివాస్ జీ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »