గెలుపు పై ధీమా వ్యక్తం చేసిన దండు ఇస్తారి

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్ రూరల్

రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కువ సీట్లను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతున్నారని అన్నారు.చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోశాలతో ఉన్నారని తెలియజేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు, రైతులు ఎంతో ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆయన అన్నారు. ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలో వచ్చి ఏ హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం రైతులకు చెల్లించాలని కోరారు. వెంటనే రైతు సమస్యలనుపరిష్కరించాలని అన్నారు.రైతును రాజుగా చేసిన కేసీఆర్ గారిని గుర్తు చేసుకున్నారు కేసీఆర్ గారి హయాంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని సకాలంలో రైతుబంధు వచ్చేదని తెలియజేశారు.

You may also like...

Translate »