దేశ సేవకే గాంధీ కుటుంబం అంకితం

దేశ సేవకే గాంధీ కుటుంబం అంకితం
రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన
కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివగాళ్ల యాదయ్య
జ్ఞాన తెలంగాణ, (తుక్కుగూడ)
దేశ సేవకే గాంధీ కుటుంబం అంకితం అయిందని తుక్కుగూడ మున్సిపల్
కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివగాళ్ల యాదయ్య అన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం
తుక్కుగూడ మున్సిపాలిటీ మంఖల్ గ్రామంలో రాజీవ్ గాంధీ 33 వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివగాళ్ల యాదయ్య రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రజలకు సేవ చేయడానికి గాంధీ కుటుంబం అంకితమైందని వారు చేసిన సేవ చిరస్మరణీయమని రాజీవ్ గాంధీ ఆశయాల కోసం అందరం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివగాళ్ల యాదయ్య, విజయ భాస్కర్ రెడ్డి, బూడిద శ్రీకాంత్ గౌడ్, కప్పల సుందరయ్య,చిప్ప సురేష్,బాకీ సాల్మన్ ,కామొల్ల మహేష్, బాకీ ప్రకాష్,భారీగాళ్ల నర్సింహ,తొండిపల్లి గిరి, కామొల్ల దేవేందర్,బాకీ శకర్ బాకీ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.