అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

సమ్మెకు మద్దతు తెలిపిన చేవెళ్ళ బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు
అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేవెళ్ల ఐసీడీఎస్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం 9 వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ చేవెళ్ళ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ లు *అబ్రహం లింకన్, రాజ మహేంద్ర వర్మ లు మాట్లాడుతూ….ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26, వేలను ఇవ్వాలని, పెన్షన్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.10 లక్షలు మినీ టీచర్లకు రూ.5 లక్షలు చెల్లించాలన్నారు రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలు నిర్ణయించాలని, ప్రధానమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా అంగన్వాడీ ఉద్యోగుల పట్ల మొండి వైఖరి వ్యవహరిస్తుందన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే బహుజన్ సమాజ్ పార్టీ వారి పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో షాబాద్ మండల అధ్యక్షులు మళ్ళీ వెంకటేష్, మున్నూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు