కంది పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్


జ్ఞాన తెలంగాణ,జనగామ కలెక్టరేట్ ప్రతినిధి:

రైతులు పండించిన కంది పంటను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు.శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో కంది పంట కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంది పంట సాగు చేసిన రైతులు తమ పంటకు రాష్ట్ర ప్రభుత్వం మార్కుఫెడ్ ద్వారా ఒక క్వింటాకు మద్దతు ధర 7550 లు కల్పించి కొనుగోలు చేస్తున్నందున రైతులందరూ తమ పంటను విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని కలెక్టర్ కోరారు. రైతులు కూడా తమ పంటను ప్రమాణాల కనుగుణంగా శుభ్రపరచి AEO వద్ద ధ్రువీకరణ పత్రంతో పాటు తమ పట్టాదారు పాసుబుక్ , ఆధార్ కార్డు , బ్యాంకు అకౌంట్ నెంబర్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకొని రావాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మార్క్ ఫెడ్ అధికారి రంజిత్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి నరేంద్ర , వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్ , వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సెక్రటరీ శ్రీనివాస్, పి ఎ సి ఎస్ చీటకోడూరు సి ఇ వోభాస్కర్ రెడ్డి , రైతులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »