డ్వాక్రాలో అవినీతి లీలలుఅడ్డు చెప్పలేక గ్రామ దీపికల తీవ్ర ఆవేదన…

పై అధికారుల అండదండలతో అవినీతి పనులు?
జ్ఞాన తెలంగాణ న్యూస్ తల్లాడ…:
ఉన్నతాధికారులు అండదండలతో మండల సమైక్య కార్యాలయంలో తవ్వినకొద్ది అవినీతి లీలలు వెలుగులోకి వస్తున్నాయి.వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రమ్య గ్రామ సమైక్య లో శ్రీరామ గ్రూపు సభ్యురాలు కాంపేల్లి తిరుమల పేరు ను మార్చి ఆమె కూతురు పసుపులేటి నరసమ్మను ఎటువంటి తీర్మానం లేకుండా గ్రూపు సభ్యులుగా ఉన్నట్లు గ్రూపుకు సంబంధించిన పుస్తకంలో రాసుకొని సీసీ నరసింహారావు,ఏ పి ఎం చిన్న వెంకటేశ్వర్లు ,ఎస్బిఐ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసరావు కలిసి లక్ష రూపాయలు పసుపులేటి నరసమ్మకు ఇప్పించటం జరిగిందని కొంతమంది డోక్రా మహిళలు ఆరోపిస్తున్నారు ఇట్టి విషయమై రమ్య గ్రామ సమైక్య వివో సభ్యులు,గ్రామ దీపిక వరపర్ల దుర్గ సీసీ నరసింహారావును నిలదీసి అడగడంతో,ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని గ్రామ దీపిక వరపర్ల దుర్గాను,పాత వి వో సభ్యులను తొలగించి బ్యాంకులో అకౌంట్ ను సైతం మార్చడం జరిగిందని వారు అన్నారు.ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా చాకచక్యంగా పసుపులేటి నరసమ్మను గ్రామ దీపికగా గ్రూపు సభ్యులకు,బ్యాంకు సిబ్బందికి , శ్రీలక్ష్మి మండల సమైక్య కార్యాలయం సిబ్బందికి పరిచయం చేసి రమ్య గ్రామ సమైక్య వివో కు సంబంధించిన కార్యకలాపాలు ఆమెతో జరిపిస్తున్నారని ఇట్టి విషయమై పై అధికారులకు పలుమార్లు తెలియపరచిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి పై విషయమై క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని రెడ్డిగూడెం గ్రామ గ్రూపు సభ్యులు కోరుతున్నారు.