విద్యార్థులకు అన్యాయం చేస్తున్న సీఎం రాజీనామా చేయాలి…

ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్
ఏభిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున బీమారంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియామ్బెర్స్మెంటే స్కాలర్షిప్స్ నీ విడుదల చేయాలనీ ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఓట్లతో మరియు విద్యార్థుల తల్లిదండ్రులఓట్లతో గెలిచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రములో అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థులకు ఫీజు రియాంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకుండ విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడటం చాలా బాధాకరం అని మంద నరేష్ అన్నారు ప్రతి పక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థుల ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తా విద్యార్థులకు ఫీజు రియాంబర్స్ మెంట్ విడుదల చేస్తా అని హామీ ఇవ్వడంతో విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీనీ తెలంగాణ రాష్ట్రములో అధికారంలోకి తీసుకొచ్చారని మంద నరేష్ అన్నారు తెలంగాణా రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డి అయ్యాక పూర్తిగా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని కనీసం విద్యాశాఖ కి మంత్రినీ నియమించకపోవడం సిగ్గుచేటని మంద నరేష్ అన్నారు విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసుకొని పై చదువులకు వెళ్లాలంటే విద్యార్థులకు ఫీజురియాంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రైవేట్ విద్యాసంస్థలలో చదువుకున్న విద్యార్థులకు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపాల్సిన పరిస్థితులు వచ్చాయని మంద నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు చిన్నచూపనీ అన్నారు ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన భోజనం విద్యను అందించడంలో విఫలం అయ్యిందని నరేష్ అన్నారు జిల్లాలో స్టూడెంట్ మేనేజ్ మెంట్ హాస్టల్స్ విద్యార్థులకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలనీ మంద నరేష్ అన్నారు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి విద్యార్థులకు ఫీజు రియాంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తామని సీఎం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయకపోతే జిల్లాలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తామని మంద నరేష్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏభిఎస్ఎఫ్ నాయకులు ఇప్ప భరత్ ఉదయ్ ప్రసాద్ శ్రీకాంత్ మధు అశోక్ ఈశ్వర్ గోవింద్ రాజు నందు శ్రీనివాస్ డేగ ప్రశాంత్ జీవన్ శ్రావణి నవ్య అఖిల కళ్యాణి తదితరులు పాల్గొన్నారు