ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి తప్పకుండా నెరవేరుస్తారు

ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి తప్పకుండా నెరవేరుస్తారు
ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధనుంజయ
జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా నెరవేరుస్తానని రాజేంద్రనగర్ నియోజక వర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధనుంజయ అన్నారు.రాజేంద్రనగర్ లో సోమవారం ధనుంజయ మాట్లాడుతూ గత పదేళ్లుగా అధికారం లో ఉన్న ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సుస్థిరమైన పాలన అందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు.రాష్ట్రం రేవంత్ రెడ్డి సారథ్యం లో ఆరు గ్యారేంటేల పథకాల అమలు తప్పకుండా జరుగుతాయని అన్నారు.ఇప్పటికే ఉచిత బస్ 500 గ్యాస్ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ దే విధంగా చర్యలు చేపడుతోంది అన్నారు.రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతోంది అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.