వేగం కన్నా – ప్రాణం మిన్న

వేగం కన్నా – ప్రాణం మిన్న
– వాసవి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో రోడ్ సేఫ్టి అవగాహణ కార్యక్రమం
– రోడ్ సేఫ్టి ట్రస్టు చైర్మన్ శ్రీరాంశర్మ, శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్.నరేష్ కుమార్
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి : మితిమీరిన వేగం తో వాహనాలను నడిపితే ప్రాణాలు పోవడమే కాక జీవితాంతం నరకం అనుభవించేలా అంగవైకల్యం కూడా ఏర్పడుతుందని రోడ్ సేఫ్టి ట్రస్టు చైర్మన్ శ్రీరాంశర్మ, శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్.నరేష్ కుమార్ లు పేర్కొన్నారు. బుధవారం స్థానిక వాసవి వొకేషనల్ కళాశాలలో సేవా ఫౌండేషన్ అద్వర్యంలో రోడ్ సేఫ్టి అవగాహణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ నిర్లక్షంగా, అతి ఉత్సాహంగా వాహనాలు నడిపితే మీతో పాటు ఎదుటి వాహనదారుల ప్రాణాలకు కూడా హాని కలుగుతుందన్న ఆలోచన ప్రతీ యువతీ యువకలలో ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ రాంచందర్, కరెస్పాండెంట్ ప్రింయాంకలు మాట్లాడుతూ మేజర్లు కాకుండా వాహనాలు నడిపితే చట్ట రీత్యా జైలు పాలు కావలసి రావడమే కాకుండా కుటుంబ పరువుకు భంగం కలిగించిన వారవుతారని హెచ్చరించారు. అనంతరం రోడ్ సేఫ్టి ట్రస్ట్ చైర్మ శ్రీరాంశర్మ హై కోర్ట్ న్యాయవాది కాబట్టి విద్యార్థులకు చట్టాల పట్ల అవగాహణ కలించి, విధ్యార్థులతో ప్రమాణం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు సీ.జైరాంరెడ్డి, సభ్యులు రవి యాదవ్, సన్నిలు పాలొగన్నారు.
