ఈ సెట్ రాష్ర్ట స్థాయిలో ప్రతిభ కనబరిచిన సాహిత్యను అభినందించిన టి జి పి ఏ రాష్ర్ట ఉపాద్యక్షులు దార మధు


జ్ఞాన తెలంగాణ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కెక్కర్ల తిరుపతి స్వరూప గౌడ్ దంపతుల కుమార్తె సాహిత్య ఇటివల ఈ సెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 102 మార్కులు సాధించి 155వ ర్యాంకుతో ప్రతిభ కనబరిచినది.సాహిత్య నందిమేడారం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో పదవ తరగతిలో 10జిపిఏ సాధించి పాలిటెక్నిక్ లో 3,657 ర్యాంకుతో జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రామంతపూర్ లో డిప్లమా పూర్తి చేసుకోని ఈ సెట్ అర్హత పరీక్ష రాసినది.ఈ సందర్భంగా బుదవారం సాయత్రం సాహిత్య ఇంటికి వెళ్ళి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగినది.అనంతరం టి జి పి ఏ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ర్ట ఉపాద్యక్షులు రాష్ర్ట నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్ దార మధు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థి ఇలాగే కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.తల్లిదండ్రులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏట్ సుల్తాన్ బాద్ బాలుర గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటి ఛైర్మన్ మరియు టి జి పి ఏ జిల్లా అధ్యక్షులు సిలుముల సంజీవ్,సాహిత్య పెద్దనాన్న పెద్దమ్మ కెక్కర్ల గిరిరాజు పద్మ,పల్లవి,హిమాన్షు,తాటి సమ్మయ్య గౌడ్,తాటి రమేష్ గౌడ్,తాటి శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు.

You may also like...

Translate »