కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

జ్ఞాన తెలంగాణ హనుమకొండ

కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడానికి నిరసిస్తూ బి ఆర్ ఎస్ వి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బొమ్మను బి ఆర్ ఎస్ వి నాయకులు దహనం చేసేందుకు ప్రయత్నించగా… పోలీసులు అడ్డుకున్నారు.దీంతో బి ఆర్ ఎస్ వి నాయకుల, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బి ఆర్ ఎస్ వి నాయకులు మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర కలిగిన కాకతీయ కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారు అని ప్రశ్నించారు. కాకతీయ కళాతోరణాన్ని తొలగింపు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

You may also like...

Translate »