తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు ప్రత్యేక రైళ్లు: సెంట్రల్ సౌత్ రైల్వే.

హైదరాబాద్‌ మే 09: తెలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులు ప్రత్యేక రైళ్లు నడపుతున్నట్లు ప్రకటించింది. 13, 14 తేదీల్లో సికింద్రాబాద్‌- కాకినాడ, కాకినాడ- సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది సెంట్రల్ సౌత్ రైల్వే

లోక్‌సభ ఎన్నికల్లో 4వ విడతలో భాగంగా ఏపీ, తెలంగాణలో పోలింగ్‌ జరగనుంది. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా అదే రోజు జరగనుంది. ఏపీకి చెందిన చాలా మంది ఓటర్లు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు చోట్ల ఉన్నారు.

దీంతో వారి ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున. సికింద్రాబా ద్‌-కాకినాడ స్పెషల్‌ ట్రైన్స్‌ నడిపేందుకు సిద్ధమైంది.

You may also like...

Translate »