సోనియా గాంధీ త్యాగమే తెలంగాణ రాష్ట్రం

టేకుమట్లలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జాతీయ జెండా ఆవిష్కరించిన సతీష్ గౌడ్
జ్ఞాన తెలంగాణ టేకుమట్ల.
రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగ యువత చేసుకునే ఆత్మబలి దానాలను చూసి చలించిపోయిన సోనియ గాంధీ తెలంగాణ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ ప్రజల న్యాయమైన కోరిక తీర్చడం కోసం తెలంగాణ తల్లి సోనియా గాంధీ చేసిన సాహసోపేత నిర్ణయం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు.
మండల కేంద్రంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి జాతీయ జెండా ఎగరవేశారు.
ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ, సమాఖ్య రాష్ట్రంలో ఆంధ్ర నాయకుల అత్యుత్సాహం, తెలంగాణ నాయకుల స్వార్థ రాజకీయాలతో తెలంగాణ ప్రాంతం అనేక రంగాల్లో వెనుకబడిందని, నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ వి తెలంగాణకే దక్కాలని నాలుగు కోట్ల ప్రజలు చేసిన ఉద్యమం చూసిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ తల్లిగా నిలిచిందన్నారు.
10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాష్ట్రం 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, కానీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయిందన్నారు.
ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు, అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలను నిరుపేదలైన లబ్ధిదారులకు అందేలా చేసి ఇందిరమ్మ కలలు కన్న రాజ్యాన్ని తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయనున్నట్లు సతీష్ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పరెడ్డి కృష్ణారెడ్డి జిల్లా నాయకులు తోటగట్టయ్య.కత్తి సంపత్,బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాంపల్లి వీరేశం, మండల ఉపాధ్యక్షులు మాదం కొమురయ్య.మోతే రాజమౌలి. మండల ప్రధాన కార్యదర్షులు ఎడ్ల రమేష్.దాసరపు సదానందం.వివర్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆడెపు సంపత్, మండల నాయకులు కొయ్యల చిరంజీవి,కూర రాజిరెడ్డి,రాజేశం.సంపత్ రావు.ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సంగి రవి,వంగ నరేష్,నల్లబెల్లి విజేందర్,దొంతుల శ్రీను.సంపత్ రావు,స్వామి రావు,అల్లం ఓదెలు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నూనెటి రమేష్ మండల యూత్ నాయకులు బాండ్ల మహేష్ రాజేందర్,తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »