జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలి..

- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ట్రాక్ సూట్ల పంపిణీ..
జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు జనవరి 17 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడ కేంద్రంగా ఈనెల 19 నుండి 23వ తేదీ వరకు జరగనున్న స్కూల్ గేమ్స్ జాతీయస్థాయి అండర్ 14 బాలికల కబడ్డీ పోటీలలో..తెలంగాణ రాష్ట్ర సత్తాను చాటాలని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఇటీవల పటాన్ చెరు లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి అండర్ 14 బాలికల పోటీలలో విజేతలుగా నిలిచి.. గుడివాడలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతున్న తెలంగాణ జట్టుకు శనివారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రాక్ సూట్లు,షూస్,ప్రయాణపు ఖర్చులను సొంత నిధులతో అందజేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గాన్ని కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో పటాన్ చెరు పట్టణంలో వివిధ క్రీడల్లో జాతీయస్థాయి పోటీలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు తమ విద్యార్థులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయస్థాయి పోటీల్లోనూ మెరుగైన ప్రదర్శన అందించి తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు శివకుమారి, రవి, మల్లికార్జున, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
