కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు

Oplus_131072

హైదరాబాద్‌: కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారితో మాట్లాడారు. అక్కడ జరిగిన ఘటనల్లో భారతీయ విద్యార్థులు ఎవరూ గాయపడలేదని.. అంతా క్షేమంగానే ఉన్నారని రాయబారి తెలిపారు. సోషల్‌ మీడియా పోస్టుల్లో నిజం లేదని స్పష్టంచేశారు.కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో గత రెండు మూడు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వైద్య విద్యనభ్యసించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్న వేళ.. సీఎం రేవంత్‌ స్పందించారు…..

You may also like...

Translate »