తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. నిన్న ఆరు జిల్లాలో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలో 45.4° ఉష్ణోగ్రత నమోదయింది.

మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు.

మరోవైపు ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ జిల్లాలోని చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోని పలు మండలాల్లో 45 నుంచి 45.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని పేర్కొన్నారు. మహబూబాబాద్‌, నిజామాబాద్‌ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఎం డ తీవ్రత కొనసాగింది.

You may also like...

Translate »