జ్ఞాన తెలంగాణ- బోధన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను సెప్టెంబర్ వరకు తెరిపిస్తామని అలాగే బ్యాంకులకు చెల్లించవలసిన 43 కోట్లు చెల్లించడంతో చెరుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం సాలూర మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ,ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి చిత్రపటానికి చెరుకు రసంతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చేరుకు రైతులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళ చెరుకు రైతుల చిరకాల స్వప్నం అయిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం చేయుటానికి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీ పునఃప్రారంభించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయడం సంతోషకరమన్నారు. ఫ్యాక్టరీ పునరుద్దరణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కి చెరుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ గంగా శంకర్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి , బోధన్, సాలురా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వర్ రావు , మందర్నా రవి, అల్లే రమేష్, అల్లే జనార్దన్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీహారి హన్మంత్ రావు, చీల శంకర్, శీనన్న, సంజీవరెడ్డి, చెరుకు రైతులు మురిగే శంకర్, ఛిద్రపు రాములు, రమేష్, మార్కల్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.