బొప్పాపూర్ వాగును పరిశీలించిన తహసిల్దార్

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని (రుద్రూర్): రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామ శివారులోని గుండ్ల వాగు వరద ఉధృతిని శనివారం తహసిల్దార్ తార బాయి పరిశీలించారు. గత మూడు రోజుల నుండి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా రుద్రూర్ చెరువు నిండి గుండ్ల వాగు ద్వారా ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ఉధృతి కారణంగా వాగు ప్రమాదకరంగా పారుతుందని రుద్రూర్, బొప్పాపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. తహసిల్దార్ వెంట పంచాయతీ కార్యదర్శులు, అధికారులు ఉన్నారు.
