బిఎస్పీ చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా కౌకుంట్ల వాసి టప్ప కృష్ణ నియామకం

చేవెళ్ల గడ్డపై నీలి జెండా ఎగురవేద్దాం నాతో కలిసి రండి
— చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన నూతన అధ్యక్షుడు టప్ప కృష్ణ
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా కౌకుంట్ల వాసి టప్ప కృష్ణ ను నియమిస్తూ రంగారెడ్డి జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు పల్లాటి రాములు నియామక పత్రం అందజేశారు.. బహుజన సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెల దర్మేందర్, రాష్ట్ర కార్యదర్శి గ్యార జగన్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్రహం లింకన్,జిల్లా ఇంచార్జ్ దొడ్డి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కాటేపాక రమేష్,జిల్లా ప్రదాన కార్యదర్శి పానుగంటి ప్రవీణ్ ల, సమక్షం లో చేవెళ్ల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా టప్ప కృష్ణను నియమిస్తూ గురువారం నియామక పత్రం అందజేశారు. . ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు టప్ప కృష్ణ మాట్లాడుతూ, నాపై విశ్వాసంతో నియోజకవర్గ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షులు పల్లాటి రాములు కు, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన రాష్ట్ర నాయకులకు, చేవెళ్ల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. చేవెళ్ల నియోజకవర్గ స్థాయి లో బీఎస్పీ పార్టీ నీ బలోపితం చేసి పూర్వ వైభవం తీసుకొస్తానని, ఎప్పటికైనా రాష్ట్రంలో రాబోయేది బహుజన రాజ్యమేనని రాష్ట్ర ఈ సందర్భంగా ఆయన అన్నారు. చేవెళ్ల నియోజక వర్గ ప్రజలందరూ బీఎస్పీ పార్టీతో కలిసి నడవాలని, నియోజకవర్గ ప్రజలకు, బీఎస్పీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బీఎస్పీ నాయకులు అనంత రాములు,బిక్షపతి, ప్రభాకర్, ప్రశాంత్, యాదగిరి, కాశీ విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.