సికింద్రాబాద్ లో తపస్వి పీపుల్స్ లైబ్రరీ ప్రారంభోత్సవం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,ఆగస్టు 16 :
సాహితీ ప్రపంచంలో తనకంటూ విశేషమైన స్థానాన్ని సంపాదించుకున్న తపస్వి మనోహరం సంస్థ, అంతర్జాల వేదికగా తెలుగులో తపస్వి మనోహరం వారపత్రిక, మనోహరి మహిళా మాసపత్రికలు మరియు హిందీ, ఇంగ్లీష్ లో కూడా మాసపత్రికలను వెలువరిస్తూనే తపస్వి డ్రీమ్ టేల్స్ అనే మరొక వినూత్న వేదికను ప్రారంభించి, స్టాండప్ స్టోరీ టెల్లర్స్ ని సమాజానికి పరిచయం చేస్తూ, కథలు చెప్పడంలో మెళకువలను నేర్పిస్తూ ముందుకు సాగుతున్నారు.కార్తిక్ నిమ్మగడ్డ తపస్వి సంస్థల సిఈవో పత్రికా ప్రపంచంలో తమ స్థానాన్ని పదిలపరచుకోవడమే కాకుండా పబ్లిషర్ గా ఎన్నో వందల పుస్తకాలను అతి తక్కువ ఖర్చులో అందంగా అచ్చువేసి వర్దమాన రచయితలకు కలలను సాకారం చేయడం కూడా తపస్వి సంస్థలు సాధించిన ఘనత.సికింద్రాబాదులో తపస్వి పీపుల్స్ లైబ్రరీ పేరుతో ఉచిత లైబ్రరీని ప్రముఖ కవయిత్రి, రచయిత్రి కణిక వ్యవస్థాపక అధ్యక్షురాలు మోటివేషనల్ స్పీకర్ రమాదేవి కులకర్ణి, ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో తపస్వి సంస్థల డైరెక్టర్స్ శ్రీ స్వప్న(బుజ్జమ్మ) శ్రీ మలవతు విజయ,ఇతర టీమ్ మెంబెర్స్ పాల్గొన్నారు.సాధనా కుటీర్ అనబడే ఒక చక్కని ఆవరణలో అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండేలా లైబ్రరీ ప్రారంభోత్సవం జరిగింది. కనెక్ట్ హజ్ ఫౌండర్ కిరణ్ రాథోడ్, సౌజన్యంతో వివిధ కార్యక్రమాలు సంగీతం, ఆర్ట్స్, ఇతర ఈవెంట్స్ కూడా జరుగుతాయని, అందరికీ అందుబాటులో ఉండేలా వివిధ కళలలో వర్క్ షాప్స్ నిర్వహిస్తామని అన్నారు
end
